బెల్లానికి జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలి
- 11 Views
- admin
- May 17, 2017
- తాజా వార్తలు స్థానికం
సీఎంకు ఎమ్మెల్యే పీలా వినతి
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: బెల్లానికి జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఒక మెమోరాండం సమర్పించినట్లు స్థానిక శాసనసభ్యుడు పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో నల్లబెల్లంపై ఆంక్షలు తొలగించిన సందర్భంగా బెల్లానికి గిరాకీ పెరిగిందని ఈ ఏడాది బెల్లం ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు కూడా ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. బెల్లం వ్యవసాయ ఉత్పత్తి అయినందున జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పిస్తే రైతులు, వర్తకులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. బెల్లం ఉత్పత్తులు అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్ర ఇతర ప్రాంతాలకు వెళ్తాయని జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పిస్తే రైతులకు ప్రయోజనం చేకూర్చుతుందని మెమోరాండంలో విన్నవించారు. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు ఆయన చెప్పారు. ఆయనతో పాటు పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పాల్గొన్నారు.
కార్మికులకు మాస్క్‌లు పంపిణీ
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: జీవీఎంసీ కార్మికు లకు బుధవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాస్క్‌లను అందజేశారు. జీవీ ఎంసీ కమిషనర్ సుభాని చేతుల మీదుగా అందజేశారు. పారిశుధ్య మెరుగుపరిచే క్రమంలో దుమ్ము, ధూళి పీల్చడం వలన కార్మికులు అనా రోగ్యపాలవుతున్నారన్నారు. కాలుష్య నివారణ కోసం కార్మికులకు మాస్క్‌లను పంపిణీ చేసినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరనాథ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.రవికు మార్, కె.గణేష్‌బాబు, కె.రామకృష్ణ, ఏ.నారా యణరావు తదితరులు పాల్గొన్నారు.
చోరీకి ప్రయత్నించిన యువకుడి అరెస్ట్
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: ఇక్కడికి సమీపం లోని కొత్తూరు జంక్షన్లో సోమవారం అర్ధరాత్రి చోరికి ప్రయత్నించిన యువకుడిని అరెస్టు చేశారు. పోలీసులు ఇచ్చిన వివరాలు ప్రకారం కొత్తూరు జంక్షన్లో ఉన్న నూకాంబిక వైన్స్ షాపు గోడ కు తూర్పుగోదావరిజిల్లాకు చెందిన దేవర బుజ్జి పెద్ద రంధ్రం చేసి షాపులోకి ప్రవే శించాడు. దొంగ ప్రవేశించిన చప్పుడు విన్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో గస్తీ తిరుగు తున్న పోలీసులతో పాటు షాపులోకి వెళ్లి పరిశీలించిన నిందితుడు నగదు, మద్యం బాటిళ్లుతో దొరికాడు. షాపు యజమాని యల్లపు రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


