నియోజకవర్గాల పెంపు కథ ముగిసినట్టే!?
- 13 Views
- admin
- May 18, 2017
- జాతీయం తాజా వార్తలు స్థానికం
అమరావతి, ఫీచర్స్ ఇండియా: ఏపీలో శాసనసభ స్థానాల పెంపు కథ ముగిసిపోయినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అనేది దాదాపు అసాధ్యమేనని తేలిపోయింది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే సీన్ కూడా సీఎం చంద్రబాబుకు ఇప్పుడు లేదనే చెప్పాలి. దీంతో ప్రతిపక్ష వైసీపీ నుంచి టీడీపీలో జంప్ అయిన వారితోపాటు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన 21 మంది ఎమ్మెల్యేలను అనేక ప్రలోభాలు, బెదిరింపులతో తన పార్టీలోకి లాక్కున్నారు చంద్రబాబు. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేతల చేరికపై ఆయా అసెంబ్లీ స్థానాల తెలుగుదేశం పార్టీ నేతలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు తీవ్ర అసంత వెలిబుచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుతామని అప్పుడు ఇరువరికీ చెరో స్థానం కేటాయిస్తామని అసంత ప్తులను బాబు బుజ్జగించాడు.
అయితే ప్రస్తుతం బీజేపీ, టీడీపీ పొత్తు చెడిందన్న వార్తలు నేపధ్యంలో ఇక నియోజకవర్గాల పెంపుపై ఉన్న దింపుడు కళ్లం ఆశ కూడా పోయినట్టేనని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. మొన్న జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ విషయాన్ని బాబు పరోక్షంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాలున్నా, 225 స్థానాలున్నా మెజారిటీ మనమే గెలవాలని అనడం ద్వారా నియోజకవర్గాల పెంపు ఉండబోదనే సంకేతాలు పంపారు.
తాజాగా ప్రధాని మోదీతో జగన్ భేటీని టీడీపీ రచ్చ చేయడంతో మోదీకి చంద్రబాబుకు మధ్య దూరం పెరిగింది. అసలు వీరిరువురి పొత్తు ఎన్ని రోజులుంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. చంద్రబాబు విషయంలో వెంకయ్యనాయుడు కూడా పెద్దగా పూసుకోదలుచుకోలేదు. ఈ నేపధ్యంలో నియోజకవర్గాల పెంపు అంశం ప్రత్యేక హోదా లాగా మరో ముగిసిన అధ్యాయమేనని రాజకీయా వర్గాల భోగట్టా.


