న్యూఢిల్లీ: పాకిస్థాన్ రహస్య అణు స్థావరాల గుట్టు తెలిసింది. అణ్వయుధ సామర్థ్యం కలిగి ఉన్న షెహీన్ మిస్సైళ్లను పాక్ ఎక్కడ దాచిందో గుట్టు రట్టు అయ్యింది. ఆ ప్రమాదకర మిస్సైళ్లను ఖైబర్-ఫక్తున్క్వాలోని పీర్‌థాన్ పర్వతశ్రేణుల్లో దాచిపెట్టినట్లు తెలుస్తున్నది. శాటిటైట్ చిత్రాల ఆధారంగా ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ అంచనాకు వచ్చారు. షెహీన్ బాలిస్టక్ మిస్సైళ్లు సుమారు 2750 కిలోమీరట్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను కూల్చగలవు. అయితే ఆ క్షిపణులు అణుసామర్థ్యం కలిగి ఉన్న విషయం తెలిసిందే. షెహీన్ మిస్సైళ్లను స్టోర్ చేసిన ప్రాంతం భారత్‌కు అతి సమీపంలో ఉంది. పీర్ థామ్ పర్వత ప్రాంతాలు అమృత్‌సర్‌కు కేవలం 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్థాన్ గతంలోనూ అణ్వాయుధాలను సమీకరించింది. వాటిని దాచిపెట్టేందుకు ప్రత్యేక ప్రాంతాలనూ ఎంపిక చేసుకున్నది. అణ్వాయుధాలను భద్ర పరిచేందుకు పాకిస్థాన్ టన్నెళ్లను కూడా నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షెహీన్ మిస్సైళ్లను దాచి పెట్టేందుకు 2003 నుంచి 2011 వరకు ఆ టన్నెల్‌ను నిర్మించినట్లు తెలుస్తున్నది. పాక్ వద్ద ప్రస్తుతం 140 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పాక్ రహస్య అణుస్థావరాల గుట్టు రట్టు !
- 19 Views
- admin
- May 18, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
Categories

Recent Posts

