ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఫ్యాక్షన్ హత్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. జిల్లాల్లో ఏళ్ల తరబడి గొట్టిపాటి రవికుమార్ వర్గానికి, కరణం బలరాం వర్గానికి పాత పగలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే.ఈ హత్యలకు కారణం వీరి మధ్య ఉన్న గొడవలెనా అనే అనుమానాలు పోలీస్ లు వ్యక్తపరుతున్నారు. అద్దంకి నియోజక వర్గంలో మేరవరం గ్రామంలో జంట హత్యలు జరిగిన విషయం తెలిసిందే. దీనితో పోలీస్ లు అద్దంకి నియోజక వర్గాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ హత్యల లో పోలీస్ లు 17 మందిని నిందితులుగా గుర్తించడం విశేషం.వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికోసం పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. దాదాపు 200 మంది పోలీస్ లతో నియోజకవర్గం లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ హత్యలలో నిందితులు వాడిన కత్తులు, కర్రలు, కరం డబ్బాలను పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా రచించుకున్న పక్కా ప్రణాళికతోనే ఈ హత్యలకు నిందితులు పాల్పడినట్లు పోలీస్ లు చెబుతున్నారు.అద్దంకి నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ రెండు గ్రూప్ లుగా చీలిపోయింది. ఈ హత్యలను కరణం బలరాం వర్గీయులపై, గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు దాడిగా అనుమానిస్తునారు. మేరవరం గ్రామం లో చాలా ఏళ్లుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉందని అందువలనే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.
నిందితులు ఈ హత్యలు చేయడానికి వేసుకున్న పథకంలో భాగంగానే వారి ఇళ్లవద్ద అనధికారికంగా స్పీడ్ బ్రేకర్లను నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల వాహనాలు అటుగా వెళ్లే సమయంలో స్పీడ్ బ్రేకర్ల వలన వారి వాహనాలు నెమ్మదిస్తాయి.దీనితో వారిపై సులభంగా అటాక్ చేయెచ్చనేది ప్లాన్, అనుకున్నప్రకారమే శుక్రవారం రాత్రి తమ ప్రత్యర్థులు పెళ్ళికి వెళ్లి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న నిందితులు మహిళ సాయంతో దారి వద్ద కాపు కాచారు.మొదట లక్ష్మి అనే మహిళ వారిపై కారం చల్లింది. దీనితో వేరు కింద పడిపోవడంతో అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తులతో 17 మంది వారిపై విచక్షణ రహితంగా దడి చేసినట్లు తెలుస్తోంది.
దాడి ఘటన గురించి గ్రామస్తులు తెలుసుకుని అటుగా రావడంతో అప్పటికే సిద్ధం చేసుకున్న కారులో వారు బట్టలు, నగలు, నగదు తో పరారైనట్లు తెలుస్తోంది. గాయపడి వారిని ఆసుపత్రికి తరలించగా మధ్యలోనే మరణించారు. దాడికి పాల్పడిన 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారుగా పేర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో కారణం బలరాం వర్గం మొదటి నుంచి టిడిపిలో ఉంటోంది. గొట్టిపాటి వర్గం మొదట కాంగ్రెస్ ఆ తరువాత వైసిపి పార్టీలో ఉన్నారు. ఇటీవల గొట్టిపాటి రవికుమార్ టిడిపిలో చేరారు. ఆయన చేరికని కరణం వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పట్లో చంద్రబాబు ఇరువర్గాలకు సర్ది చెప్పినా మల్లి వీరి మధ్య ఫ్యాక్షన్ గొడవలు బయట పడడంతో టిడిపికి ఈ వివాదం తలనొప్పిగా మారింది.