రియాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టెప్పులేశారు. ప్రస్తుతం సౌదీ పర్యటనలో ఉన్న ట్రంప్ తన అధికారబృందంతో అక్కడి సంప్రదాయ నృత్యం అర్దలో పాల్గొన్నారు. మురబ్బా ప్యాలెస్ ప్రాంగణంలో ట్రంప్ కత్తి పట్టుకుని కళాకారులతో కాలు కదిపారు. ట్రంప్ తన చేష్టలతో అందరినీ ఆశ్చర్య పరిచారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి రేక్స్ టిల్లర్సన్, ఆర్థిక మంత్రి విల్బర్ రోజ్ తెలిపారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకాతో కలిసి రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ట్రంప్ సౌదీ వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇది ఆయన తొలి విదేశీ పర్యటన. సౌదీతోపాటు, ఇజ్రాయెల్, వాటికన్ సిటీ, బెల్జియం, ఇటలీ దేశాల్లో ఎనిమిదిరోజులపాటు ఆయన పర్యటించనున్నారు. నాటో, జీ-7 దేశాల సదస్సులోనూ ట్రంప్ పాల్గొననున్నారు. మంగళవారం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) చమురు కంపెనీల యజమానులతో ట్రంప్ సమావేశంకానున్నారు. అలాగే ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరును మత విశ్వాసాల మధ్య యుద్ధంగా చూడవద్దని, క్రూరత్వానికి, మానవతకు మధ్య పోరాటంగా చూడాలని తన పర్యటనలో ట్రంప్ పిలుపునివ్వనున్నట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
సౌదీలో ట్రంప్ కత్తి డ్యాన్స్
- 11 Views
- admin
- May 22, 2017
- Home Slider అంతర్జాతీయం తాజా వార్తలు
Categories

Recent Posts

