అంబులెన్స్ కోసం కాన్వాయ్ నిలిపిన మోదీ!
- 11 Views
- admin
- May 24, 2017
- జాతీయం తాజా వార్తలు

మంగళవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 52వ ఆఫ్రికన్ అభివృద్ధి బ్యాంక్ వార్షిక సమావేశ ప్రారంభోత్సవానికి హాజరై ప్రధాని నరేంద్రమోదీ తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో గాంధీనగర్-అహ్మదాబాద్ రోడ్డుపై వెళ్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం ప్రధాని మోదీ తన కాన్వాయ్‌ను ఆపేశారు. సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను రహదారి పక్కగా ఆపేసి అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇవ్వాల్సిందిగా సిబ్బందికి ప్రధాని ఆదేశాలు ఇచ్చారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన సమయంలోను ప్రధాని నరేంద్రమోదీ ప్రొటోకాల్‌ను పక్కన బెట్టి సాధారణమైన ట్రాఫిక్‌లో విమానాశ్రయానికి చేరుకున్నారు. వీఐసీ సంస్కృతికి చరమగీతం పాడేందుకు రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు తమ వాహనాలపై ఉన్న ఎర్రబుగ్గలను తొలగించాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతీ భారతీయుడు ఓ వీఐపీనే అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.


