‘మహాభారతం’లో కర్ణుడిగా చేయమన్నారు: అక్కినేని నాగార్జున
- 15 Views
- admin
- May 24, 2017
- Home Slider తాజా వార్తలు సినిమా

సినిమా తమదిగా భావించారు
‘‘రారండోయ్ వేడుక చూద్దాం’ నిర్మాతగా చాలా సంతోషంగా ఉన్నాను. సినిమాకు సంబంధించిన మొత్తం పని పది రోజులు ముందుగానే పూర్తయింది. ఈ సినిమా అంతా టీం వర్క్ అని చెప్పాలి. అందరూ సినిమాను తమదిగా భావించారు. ఎడిటింగ్‌లో దేవిశ్రీ చేయి కూడా వేయించా. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం’’
మానవ సంబంధాల్లో మార్పులొచ్చాయి
‘‘నిన్నే పెళ్లాడతా’ నాకు చాలా ఇష్టమైన సినిమా. అలాంటి కుటుంబ భావోద్వేగాలు ఉండాలి అనుకున్నా. అయితే ఆ సినిమా 1996లో వచ్చింది. ఇప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, తండ్రీకొడుకు, తండ్రీకూతురు మధ్య ఎలాంటి బాంధవ్యాలున్నాయనే దానికి తగ్గట్టు సినిమాను రూపొందించాం’’
నేను అలా భావించను..
‘ఏ నటుడికైనా నిర్ణీత పరిమితి ఉండాలి అనుకోవడం లేదు. ఎందుకంటే పరిమితులుంటే దానికే కట్టుబడి ఉండిపోవాలి. చైతూ విభిన్న సినిమాలు చేస్తున్నాడు. ‘ప్రేమమ్’ చేశాడు. ఇప్పుడు థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ విజయంతో చైతూ అందరికీ ఇంకా దగ్గర అవుతాడు’
ప్రొడక్షన్ గురించి ఆలోచించొద్దన్నా!
‘మా ఇద్దరు అబ్బాయిలతో ఇప్పుడే ప్రొడక్షన్ గురించి ఆలోచించొద్దని చెప్పాను. నటనపైనే ఏకాగ్రత పెట్టమని చెప్పాను. ఒక నటుడిగా కాకుండా ఇతర రంగాల్లో రాణించే నైపుణ్యం చైతూ, అఖిల్‌కి ఉంది’
రకుల్ విభిన్నంగా కనపడుతుంది
‘ఇప్పటి వరకూ చూసిన రకుల్ వేరు, ఈ సినిమాలో కనపడే రకుల్ వేరు. ఈ సినిమాలో రకుల్‌ని చూస్తే శ్రీదేవి, టబు గుర్తొస్తారు. ఆమె నటన చూసి నేను థ్రిల్ అయ్యాను. ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించా’.
‘బాహబలి’ టీం చేసిందదే..
‘బాహుబలి 2’ సినిమాకు ఇంత మంచి వసూళ్లు, మంచి పేరు వస్తోందంటే కారణం టీం మాత్రమే. వాళ్లు సినిమాను దేవుడుగా నమ్మి మనకేం వస్తుందని కాకుండా.. మంచి సినిమా తీయాలని ప్రయత్నించారు’
తదుపరి చిత్రాలు..
‘‘రాజుగారి గది 2’ సినిమా పది రోజుల షూటింగ్ మిగిలి ఉంది. సినిమా అంతా ఒకసారి చూసి ఆ పదిరోజుల చిత్రీకరణను ప్లాన్ చేస్తారు. కల్యాణ్‌కృష్ణతో తర్వాతి సినిమా కథపై కూర్చోవాలి. బంగార్రాజు చేయాలి, కానీ మంచి కథ కుదిరితేనే’.
అఖిల్ సినిమా గురించి..
‘అఖిల్ సినిమా యాక్షన్ విభాగం పూర్తయింది. ‘అఖిల్’ సినిమా టైటిల్స్ గా నాలుగైదు ఆలోచనలో ఉన్నాయి. మంచి తెలుగు టైటిలే పెడతాం’.
మహాభారతంలో చేయమని అడిగారు
‘‘మహాభారతం’లో నన్ను కర్ణుడి పాత్ర చేయమని అడిగారు. అయితే సినిమా ఆన్ కార్డ్స్‌లో ఉంది. శ్రీకుమార్ నాలుగేళ్లుగా ఈ కథపై కసరత్తులు చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే వాసుదేవనాయర్ కర్ణుడు పాత్ర చేయమని అడిగారు. నాకు కూడా చేయాలని ఆసక్తి ఉంది. మరి చూడాలి’’


