28 నుంచి ఆసెట్, ఆఈట్ ప్రవేశాల కౌన్సెలింగ్.. జూన్ 1 నుంచి సాధారణ విభాగాల కౌన్సెలింగ్ – తొలిదశ సీట్ల కేటాయింపు జూన్ 10న
- 34 Views
- admin
- May 24, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: ఆంధ్ర విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవి ద్యాలయాలలో పీజీ కోర్సులకు, ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఎన్సిసి, సిఏపి విభాగాలకు, 29న పిహెచ్, క్రీడా విభాగాలకు, 30న ఎన్ఎస్ఎస్ విభాగాలకు ప్రత్యేక ప్రవేశాలు నిర్వహిస్తారు.
జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడలో ఏర్పాటు చేసిన సర్టిఫీకేట్ల పరిశీలన కేంద్రాలలో సర్టిఫీకేట్ల పరిశీలన జరిపి స్క్రాచ్‌కార్డులను అందిస్తారు. జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. జూన్ 10వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు చేయడం జరుగుతుంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులు అదే నెల 10 నుంచి 13వ తేదీలోగా ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. జూన్ 14వ తేదీన ఖాళీల వివరాలను ప్రకటిస్తారు. రెండో దశ సర్టిఫీకేట్ల పరిశీలనను జూన్ 14 నుంచి 16వ తేదీ వరకు జరుపుతారు. రెండో దశ సీట్ల కేటాయింపు జూన్ 21న జరుపుతారు. మూడో దశ కౌన్సెలింగ్‌ను జూన్ 26వ తేదీన నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభమవుతాయి. జూలై 2 నుంచి 4వ తేదీ వరకు మిగులు సీట్లను కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల రూపంలో భర్తీ చేయడం జరుగుతుంది.
సర్టిఫీకేట్లు తీసుకురావాలి….
విద్యార్థులు సర్టిఫీకేట్ల పరిశీలనకు వచ్చే విద్యార్తులు తమవెంట హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, మార్కుల జాబితా, ప్రొవిజనల్ సర్టిఫీకేట్, ఓడి, ట్రాన్స్ఫర్ సర్టిఫీకేట్, కాండక్ట్ సర్టిఫీకేట్, స్టడీ సర్టిఫీకేట్, పదోతరగతి సర్టిఫీకేట్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫీకేట్, ఇటీవల పొందిన ఆదాయ దృవీకరణ సర్టిఫీకేట్, ప్రత్యేక విభాగాల వారు సంబంధిత అర్హతలను తెలియజేసే పత్రాలు(సర్టిఫీకేట్)లు, ఇతర విశ్వవిద్యాలయాల వారు మైగ్రేషన్ సర్టిఫీకేట్ను, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫీకేట్, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, పైన పేర్కొన్న సర్టిఫీకేట్ల నకలు(జెరాక్స్)లు మూడు సెట్లు తమ వెంట తీసుకురావాలి. కౌన్సెలింగ్ సమయంలో రిజిస్ట్రేషన్ రుసుముగా రూ 500, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి విద్యార్థులు రూ 250 చెల్లించాల్సి ఉంటుంది.
పరిశీలన కేంద్రాలు…
విద్యార్థులకు సౌలభ్యం కోసం సర్టిఫీకేట్ల పరిశీలనకు ఐదు కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమకు సమీపంలోని కేంద్రానికి వెళ్లి సర్టిఫీకేట్ల పరిశీలన జరుపుకోవచ్చును. విశాఖ పట్నంలో దూరవిద్య కేంద్రం ఎదురుగావున్న ఆన్లైన్ అడ్మిషన్ కేంద్రం, శ్రీకాకుళం గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్, మేనేజ్మెంట్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఎచ్చెర్ల, కాకినాడ ఐడియల్ కళాశాల, విజయవాడ ఎస్ఆర్ఆర్, సి.వి.ఆర్ డిగ్రీ కళాశాలలో సర్టిఫీకేట్ల పరిశీలన జరుపుతారు.
ర్యాంకుల వారీగా వివరాలు…
జూన్ 1వ తేదీన ఉదయం ఫిజికల్ సైన్స్‌లో 1-500, మద్యాహ్నం 501-1000 ర్యాంకులకు, కెమికల్ సైన్స్‌లో ఉదయం 1-1000, మద్యాహ్నం 1001 -2000 ఇంగ్లీషుకు మద్యాహ్నం 1-547 ర్యాంకులకు కౌన్సెలింగ్ జరుపుతారు. జూలై 2వ తేదీన ఉదయం ఫిజికల్ సైన్స్‌లో ఉదయం 1001-1534, కెమికల్ సైన్స్‌లో ఉదయం 2001-3 వేలు, మద్యాహ్నం 3001-4489 వరకు, హ్యూమానిటీస్, సోషల్ సైన్స్‌లో ఉదయం 1-700, మద్యాహ్నం 701-1500 ర్యాంకులకు, జూన్ 3వ తేదీన లైఫ్ సైన్స్‌లో 1-400, మద్యాహ్నం 401-800, హ్యూమానిటీస్ సోషల్ సైన్స్‌లో ఉదయం 1501-2500, మద్యాహ్నం 2501-3500, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉదయం 1-600, మద్యాహ్నం 601-1200, జూన్ 4వ తేదీన ఉదయం లైఫ్ సైన్స్‌లో 801-1200, మద్యాహ్నం 1201-1600, మేథమెటికల్ సైన్స్‌లో ఉదయం 1-500, మద్యాహ్నం 501-1000, హ్యూమానిటీస్ సోషల్ సైన్స్‌లో 3501-4500, మద్యాహ్నం 4501-5167, సమీకృత ఇంజనీరింగ్‌లో 1201-1700, మద్యాహ్నం 1701-2315, జూన్ 5వ తేదీన లైఫ్ సైన్స్‌లో 1601-2200, మద్యాహ్నం 2201-2847, మేథమెటికల్ సైన్స్‌లో 1001-1600, మద్యాహ్నం 1601-2243, జియాలజీలో ఉదయం 1-218, తెలుగులో మద్యాహ్నం 1-428 ర్యాంకులకు సర్టిఫీకేట్ల పరిశీలన జరుపుతారు. విద్యార్థులు తమకు సమీపంలోని కేంద్రంలో సర్టిఫీకేట్ల పరిశీలనకు హాజరుకావచ్చును.
14 నుంచి రెండో దశ కౌన్సెలింగ్…
మిగులు సీట్లకు జూన్ 14 నుంచి 16వ తేదీ వరకు సర్టిఫీకేట్ల పరిశీలన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ర్యాంకుల వారీగా విద్యార్థులు సర్టిఫీకేట్ల పరిశీలనకు హజరుకావాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు, ఫీజులు, రిజర్వేషన్ వారీగా సీట్ల సంఖ్య తదితర వివరాలు ఏయూ, ప్రవేశాల సంచాలకుల వెబ్సైట్లో పొందు పరచడం జరిగింది. వీటిని గమనించాలని సంచాలకులు సూచించారు. ప్రవేశాలు సాధించిన విద్యార్థులు నిర్ణీత తేదీలోగా ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. లేని పక్షంలో సదరు సీట్లు రద్దవుతాయి.
18 నుంచి నోటెస్ట్ కోర్సులకు ప్రవేశాలు…
ప్రవేశ పరీక్ష అవసరంలేని నేరుగా ప్రవేశాలకు కల్పించే పలు కోర్సులకు జూన్ నెల 18, 19 తేదీలలో ప్రవేశాలకు కల్పించడం జరుగుతుంది. 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఎమ్మెస్సీ జాగ్రఫీ(బిఏ, బిఎస్సీ), ఎంటెక్ అట్మాస్ఫియరిక్ సైన్స్, ఎంటెక్ ఓషన్ సైన్స్, ఎంటెక్ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్, ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ జియాలజీ, ఇంటిగ్రేటెడ్ అప్లయిడ్ కెమిస్ట్రీ కోర్సులకు, జూన్ 19వ తేదీన ఎంఏ సంసృతం, వుమెన్ స్టడీస్, పిజి డిప్లమో ఇన్ కో ఆపరేషన్, రూరల్ స్టడీస్, ఎంఏ హిందీ, బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ, ఏంఏ నృత్యం, ఏంఏ సంగీతం, ఎంపిఇడి కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియను పెదవాల్తేరులోని విజయనగర్ పేలస్లోని సంచాలకుల కార్యాలయంలో జరుగుతుంది.


