కేంద్ర మంత్రి మేనకాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమెను వెంటనే ఫిలిబిత్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు. మరోవైపు, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు తలెత్తాయనే వార్తలను అధికారులు కొట్టేశారు. గాల్ బ్లేడర్ లో రాళ్లు ఏర్పడ్డాయని… మెరుగైన చికిత్స కోసం ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నామని చెప్పారు.