ఐక్య పోరాటాల ద్వారా హక్కులను సాధించుకుందాం.. యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు భరణికాన రామారావు పిలుపు
- 23 Views
- admin
- June 3, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
సబ్బవరం, ఫీచర్స్ ఇండియా : యాదవులకు సమాజంలో సముచిత స్థానం లభించడం లేదని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు భరణికాన రామారావు అన్నారు. నేడు సమాజంలో మూడు శాతం ఉన్న బ్రాహ్మణులకు కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, 30శాతం జనాభా ఉన్న యాదవులను అణగదొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. మండల కేంద్రంలో కాటమరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భరణికాన రామారావు ముఖ్య అతిథిగా హాజరై కాటమరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో యాదవులకు సముచిత స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 30శాతం జనాభా ఉన్న యాదవకులకు రాజకీయంగా పదవుల్లేవని, రాజకీయ పార్టీలు తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఐక్య పోరాటాల ద్వారా హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల యాదవ సంఘం అధ్యక్షులు భరణికాన సాయినాథరావు, పల్ల తాతారావు, కోరాడ దేముడు, రోమాల దేముడు, కోరాడ శ్రీను, బంధం వెంటకరమణ, జీ నర్సింగరావు, కోన సోమేశ్వరరావు, అప్పారావు, గొంప నాయుడు తదితరులు పాల్గొన్నారు.


