బాహుబలి సినిమా కోసం 4 ఏళ్ళ సమయాన్ని కేటాయించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించేందుకు ఇటీవల యూఎస్ వెళ్లి అక్కడ నిపుణుల సమక్షంలో చాలా బరువు కూడా తగ్గినట్టు తెలుస్తుంది. హెయిర్ స్టైల్ విషయంలోను ఈ హీరో కొత్త దనం ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో కలిసి ప్రభాస్ కనిపించగా.. అందులో యంగ్ రెబల్ స్టార్ కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టేసాడు. ఇదే సాహో లుక్ అని అందరు భావించారు. కాని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫోటో ఒకటి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. క్లీన్ షేవ్ తో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్. సడెన్ గా ఆ పిక్ చూస్తే ఇది ప్రభాసేనా అని అనుమానం రాకపోదు. మరి టీజర్ లో ఒక లుక్ తో కనిపించిన ప్రభాస్ , రీసెంట్ గా విడుదలైన ఓ పిక్ లో మరోలా ఉన్నాడు. ఇక ఇప్పుడైతే క్లీన్ షేవ్ తో డిఫరెంట్ గా ఉన్నాడు. మరి వీటిలో ప్రభాస్ అస్సలు లుక్ ఏదై ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే ప్రభాస్ సడెన్ గా ఇలా కంప్లీట్ మేకోవర్ మార్చుకోవడం సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. సాహో చిత్రం 150 కోట్ల బడ్జెట్ తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.