చంచల్‌గూడ జైలుకు దీపక్‌రెడ్డి తరలింపు
- 17 Views
- admin
- June 7, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం

అసలు ఏం జరిగిందంటే..
హైదరాబాద్‌లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్ కమల్ అనే శరణార్థికి చెందిన 3.37 ఎకరాల భూమి బంజారాహిల్స్‌లో ఉండగా.. 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి అధీనంలోనే ఉంది. అక్బర్ మొహినుద్దీన్ అన్సారీ, ఖజా మొహినుద్దీన్ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులు ఆ భూమికి యజమానులుగా 2008లో సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించాడు. వారి నుంచి దీపక్‌రెడ్డి, తానూ ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పత్రాలు తయారు చేశారు. తమ భూమిని చౌదరి అండ్ బ్రదర్స్ కబ్జా చేశారంటూ శైలేష్ సక్సేనా.. భూకబ్జా నిరోధక కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో ఉండగా.. కొద్ది నెలల క్రితం చౌదరి తరఫు ప్రతినిధి రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను కోర్టులో సమర్పించారు. అనంతరం బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేయగా… పోలీసులు ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఫిబ్రవరి 7న ఆర్థిక నేరాల విభాగం.. సక్సేనా తదితరులతో పాటు ఎ5గా దీపక్‌రెడ్డిపై కేసు నమోదు చేసింది.
పలు కేసులు..: ఈ వ్యవహారంలో దురుసుగా ప్రవర్తించిన దీపక్‌రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్ భూమి కేసులో సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సీసీఎస్ వెలుపల దురుసుగా ప్రవర్తించాడంటూ సైఫాబాద్ ఠాణాలో దీపక్‌రెడ్డిపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ భూమి సొంతదారు చౌదరి ఇంటికి వెళ్లి బెదిరించినందుకు మాదాపూర్ ఠాణాలోనూ కేసు నమోదైంది.
Categories

Recent Posts

