న్యూదిల్లీ: భారతీయ మార్కెట్లో పోటీ పెరగటంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు జెట్ ఎయిర్వేస్ సరికొత్త పరిమితకాల ఆఫర్‌తో ముందుకొచ్చింది. రెయిన్ డీల్స్ పేరుతో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ.1,111గా నిర్ణయించింది. ప్రయాణికులకు నేటి నుంచి మూడు రోజులపాటు ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్లో బుక్‌చేసుకోవాల్సిన ప్రయాణ టికెట్లు జూన్ 27 నుంచి సెప్టెంబర్ 20 మధ్యలోవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఆఫర్ ఎకానమీ క్లాస్‌కు మాత్రమే వర్తిస్తుంది. జెట్ ఎయిర్వేస్ నిర్వహించే విమానాలపైనే మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. కోడ్‌షేర్, ఇంటర్లైన్పై ఇది వర్తించదు.భారతీయ మార్కెట్లో పౌరవిమానయానం రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది.. దీంతో విమానయాన సంస్థలు భారీగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిర్ ఏషియా కూడా ఇటువంటి ఆఫర్‌నే ప్రకటించింది. ఇండిగో కూడా గత వారం డిస్కౌంట్ సేల్‌ను ప్రకటించింది.