కొణతాల బాటలో సబ్బంహరి?
- 12 Views
- admin
- June 9, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
మాజీ అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు, సీనియర్ నాయకుడు సబ్బం హరి త్వరలో టీడీపీ పార్టీలో చేరే అవకాశం వుందని ఓ వార్త ఇప్పుడు అనకాపల్లి నియోజక వర్గంలో బలంగా వినిపిస్తుంది. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినాయకుడు జగన్‌కి భాగా నమ్మకస్థుడుగా ఉంటూ చివరి నిమషంలో పార్టీ వీడిన నాయకుడు సబ్బం హరి. ఆయన పార్టీ వీడుతూనే తన సంచలన ఆరోపణలతో వైసీపీకి ఎన్నికల్లో భారీగా నష్టం కలిగించాడు. ఆ తుఅరువాత పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత వ్యాపారాల మీద శ్రద్ధ పెట్టాడు. అయితే మరల వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సబ్బం హరి అనుకుంటున్నట్లు ఓ వార్త ఇప్పుడు విశాఖలో వినిపిస్తుంది. ఆయన వస్తూనే టీడీపీలో చేరుతారని, లేదంటే రాష్ట్రంలో బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ పార్టీలో చేరే అవకాశం కూడా వుందని సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే అతను అటు టీడీపీ, బీజేపీ నాయకులతో టచ్ లో వున్నట్లు అన్ని కుదిరితే ఘనంగా తన రీ ఎంట్రీ రాజకీయాన్ని ప్రజల మధ్య చేసుకోవాలనే ఆలోచనతో వున్నారని తెలుస్తోంది. త్వరలో తన నిర్ణయతాన్ని మీడియాతో పంచుకునే అవకాశాలు ఉన్నాయని హరి అనుచరవర్గం సమాచారం.


