సమయం లేదు తమ్ముళ్లూ…రణమే: చంద్రబాబు
- 12 Views
- admin
- June 9, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయవాడ, ఫీచర్స్ ఇండియా: సమయం లేదు తమ్ముళ్లూ… రణమా…శరణమా తేల్చుకోవాలంటూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చెప్పిన మాటలను కష్ణా జిల్లా నేతలు సీరియస్గా పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు రెండేళ్ళపాటు సమయం ఉందనే ధీమాలో అధికార పార్టీ నాయకులున్నారు. అయితే ఈ సమయాన్ని తమకు అనుకూలంగా విపక్షాలు ఉపయోగించుకొనే అవకాశం లేకుండా చూసుకోవాలని పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పిన మాటలను బాబు అంత సీరియస్గా తీసుకోవడం లేదు.
ఎన్నికలకు విపక్షాలు ఇప్పటి నుండే వ్యూహలను సిద్దం చేస్తున్నాయి. అయితే విపక్షాల వ్యూహలను తిప్పికొట్టేందుకు జాగ్రత్తగా మసలుకోవాలని టిడిపి చీప్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నాడు. విపక్షం బలహీనతే తమ బలం అంటూ అధికారపార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే ప్రజలతో సంబంధాలను మెరుగు పరుచుకోవడం వల్లే పార్టీకి ప్రయోజనమని బాబు పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.
బాబు చెబుతున్న మాటలను అధికారపార్టీ నాయకులు అంత సీరియస్గా తీసుకొన్నట్టు కన్పించడం లేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతిరోజూ విలువైంది ప్రతి నిమిషం, ప్రతిరోజూ విలువైందేనని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కష్ణా జిల్లా పార్టీ నాయకులకు బాబు సూచిస్తున్నారు. అయితే బాబు సూచనలను ఆ జిల్లా పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకొన్నట్టు కన్పించడం లేదు. ప్రతిపక్షం బలహీనంగా ఉందనే భావనతో అధికారపార్టీ నాయకులున్నారు. జిల్లాలో పార్టీకి ఉన్న బలాన్ని సుస్థిరం చేసుకొనే పనిలో పడ్డారు.ఎన్నికలకు రెండేళ్ళు మాత్రమే వ్యవధి ఉంది. దీంతో ప్రతి నిమిషం పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలను తీసుకోవాలని బాబు పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.
ప్రతిపక్షం కూడ బలంగా లేదు జిల్లాలో ప్రతిపక్షం కూడ బలంగా లేదనే అభిప్రాయాన్ని అధికారపార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కష్ణా జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి 10 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి రెండు సీట్లను కేటాయిస్తే కైకలూరు సీటులో ఆ పార్టీ విజయం సాధించింది. విజయవాడ పశ్చిమ స్థానంలో ఆ పార్టీ ఓటమిపాలైంది. అయితే విజయవాడ పశ్చిమ స్థానం నుండి విజయం సాధించిన జలీల్ ఖాన్, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టిడిపి గూటికి చేరుకొన్నారు. దీంతో జిల్లాలో టిడిపి బలం 12కు చేరింది. అయితే జిల్లాలో విపక్షానికి అంతగా బలం లేదని టిడిపి నాయకత్వం భావిస్తోంది. మూడేళ్ళుగా వైసీపీ నిర్వహించిన కార్యక్రమాలు కూడ పెద్దగా లేవని ఆ పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.
అధికార పార్టీ నాయకులు ప్రకటనలకే పరిమితమయ్యాయరనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా నిర్వహించే ప్రెస్ మీట్లు, ఫోటో సెషన్లకే అధికారపార్టీ నాయకులు పరిమితమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివద్ది, సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పార్టీ నాయకులు అంతగా చొరవచూపడం లేదనే విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అసెంబ్లీ స్థానాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాల సంఖ్యతో పాటు మరికొన్ని స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని విపక్షం భావిస్తోంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులే పార్టీలో ఉంటే పార్టీకి అంతగా అనుకూల పరిస్థితులు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.


