కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేయాలనుకునే దర్శక నిర్మాతలకి ముందుగా గుర్తుకువచ్చే పేరు అనుష్క. బరువైన పాత్రల్లో మెప్పించే శక్తి సామర్థ్యాలు అనుష్క సొంతం. ‘అరుంధతి’ .. ‘రుద్రమదేవి’ సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి. అలాంటి అనుష్కను ‘క్వీన్’ రీమేక్ కోసం అడిగారట. హిందీలో కంగనా రనౌత్ చేసిన ఈ సినిమాను తెలుగు .. తమిళ .. కన్నడలో త్యాగరాజన్ రీమేక్ చేస్తున్నారు.
కన్నడలో పారుల్ యాదవ్ ను ఎంపిక చేశారు. తెలుగు .. తమిళ భాషల కోసం తమన్నాను అనుకున్నారు. పారితోషికం విషయంలో తేడా కొట్టడంతో అనుష్కను సంప్రదించారట. అయితే అంతా కంగనా రనౌత్ తో పోల్చి చూస్తారనీ, అందువలన తాను ఈ సినిమా చేయనని అనుష్క సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించింది. అప్పుడే ఈ పాత్ర కోసం కాజల్ ను తీసుకున్నారట.