పన్నీర్ సెల్వమే కింగు.. సర్వేలో పచ్చి నిజాలు
- 16 Views
- admin
- June 16, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన అమ్మ జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ ముక్కలైయ్యింది. జయలలిత వారుసులు మేమే అంటే కాదు మేమే అంటూ కత్తులు దూసుకుంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి దశాభ్ధాలుగా ఎంతో చరిత్ర ఉంది.
అసెంబ్లీలో రచ్చ రచ్చ: ఎమ్మెల్యేలకు సీబీఐ గుబులు, చొక్కాలు చింపిస్తే! అలాంటి అన్నాడీఎంకే పార్టీలోని కార్యకర్తలు ప్రస్తుతం ఎవరి వైపు ఉన్నారు అంటూ తాజాగా ఓ తమిళ పత్రిక సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తాజాగా తమిళనాడులో ఎన్నికలు వస్తే అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఎవరివైపు మొగ్గుచూపుతున్నారు అంటూ సర్వేలో వెలుగు చూసింది.
నక్కిరన్ పత్రిక సర్వే: ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఏ వర్గానికి మద్దతు ఇస్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి నక్కిరన్ పత్రిక ఇటీవల సర్వే నిర్వహించింది.
అమ్మ నమ్మిన బంటు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నమ్మినబంటు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వైపు ఎక్కవ శాతం మంది అన్నాడీఎంకే కార్యకర్తలు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో పన్నీర్ సెల్వంకు 68 శాతం మంది పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి, అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి అన్నాడీఎంకే పార్టీకి చెందిన 30 శాతం మంది నాయకులు, కార్యకర్తలు మద్దతు ఉందని నక్కిరన్ పత్రిక సర్వేలో వెలుగు చూసింది. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ వారసులు మేమే అంటూ పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఈ పంచాయితీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది. అయితే అమ్మ వారసురాలు నేనే అంటూ జయలలిత మేనకోడలు దీపా రంగంలోకి వచ్చారు. అన్నాడీఎంకే పార్టీలో కార్యకర్తలు కేవలం 2 శాతం మంది జయలలిత మేనకోడలు దీపాకు మద్దతు ఇస్తున్నారు.
నక్కిరన్ పత్రిక వ్యవస్థాపకుడు ‘నక్కిరన్’గోపాలన్ సామాన్యుడు కాదు. గతంలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ను స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో నక్కిరన్ గోపాలన్ స్వయంగా అడవుల్లోకి వెళ్లి వీరప్పన్ను ఇంటర్వూ చేసి రాజ్ కుమార్ను విడిపించడంలో కీలకపాత్ర పోషించారు. నక్కిరన్ పత్రికకు తమిళనాడులో విశేష ఆదరణ ఉంది. అనేక సందర్బంలో నక్కిరన్ పత్రిక సర్వేలు నిజం అయ్యాయనే విషయం తెలిసిందే.


