ఐవిఆర్పై వేటు
- 13 Views
- admin
- June 20, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం
హైదరాబాద్, ఫీచర్స్ ఇండియా: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ పరిపాలన తీరు ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి మంగళవారం జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసి, ప్రస్తుతం బ్రాహ్మణా కార్పోరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఐవిఆర్ కష్ణారావు సోషల్ మీడియాలో అనుకోకుండా చేసిన చిన్న పొరపాటుకి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి వివరణ అడగకుండానే ఆయన్ని పదవిలోంచి తీసేసింది. టీడీపీ పరిపాలనకి వ్యతి రకంగా సోషల్ మీడియాలో జరుగుతున్నా విస్తత ప్రచారాన్ని ఆపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్ని స్తున్న సంగతి తెలిసిందే. తన పరిపాలన మీద వైసీపీ కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందని టీడీపీ నాయకులు విమర్శిస్తూ, ఆ మధ్య పేస్ బుక్ పేజీ నిర్వహిస్తున్న రవికు మార్ని అరెస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా టీడీపీ పరిపాలనకి వ్యతిరేకంగా వున్న ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీన్ని ఐవీఆర్ కష్ణారావు అను కోకుండా షేర్ చేసారు. అది టీడీపీ అధినాయకుడు దృష్టికి వెళ్ళింది. టీడీపీ ఇస్తున్న పదవులు అనుభవిస్తూ ఇలా ప్రభుత్వా నికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే నెపంతో ఆయన్ని బ్రాహ్మణ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు దీనిపై బ్రాహ్మణ సంఘాలు కాస్తా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. కష్ణారావు కూడా దీనిపై మీడియాకి వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వానికి, బ్రాహ్మణా సంఘాల మధ్య జరిగే ఈ పోరు ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
బాబుకు పక్కలో బల్లెంలా!
ప్రభుత్వం ఏరి కోరి మరీ నియమించుకున్న వ్యక్తి.. తమవైపే అస్త్రాలు ఎక్కుపెడుతుండటంతో ఏపీ అధికార పార్టీలో కలవరం మొదలైంది. బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కష్ణారావు తీరుపై గుర్రుగా ఉన్న టీడీపీ
అధిష్టానం ఎట్టకేలకు ఆయనపై వేటు వేసింది. రిటైర్ట్ అయిన తర్వాత కూడా ఆయన్ను పిలిచి మరీ.. కేబినెట్ హోదాతో గౌరవిస్తే.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ అధిష్టానం భావించింది. సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు ఐవైఆర్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మనసుకు నచ్చని కాపురం ఎన్నాళ్లని చేస్తారు? దయచేసి మీ పదవికి రాజీనామా చేసి, ఇన్నాళ్లు ఈ కాపురం చేసినందుకు భాధపడుతున్నాం అని చెప్పి, తప్పులు నిరూపించండంటూ సవాల్ విసురుతున్నారు. దీంతో ఐవైఆర్ కు సైతం దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నాం దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆయన సిద్దమవుతున్నారు. ఇంతకీ టీడీపీకి అంతలా మింగుడుపడని పని ఆయనేం చేశారంటే!..
ఇటీవల పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను అరెస్టు చేయడం పట్ల ఐవైఆర్ క షా?రావు తన ఫేస్ బుక్ ఖాతాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చేసే కామెంట్స్‌ను ప్రభుత్వం ఇంత సీరియస్‌గా తీసుకోకుండా ఉండాల్సిందనేలా ఆయన కామెంట్స్ ఉన్నాయి.
ప్రధాని మోడీతో ప్రతిపక్ష అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీని టీడీపీ నేతలు తీవ్రంగా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంలోను ఐవైఆర్ జగన్ తరుపున నిలిచి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను చాటుకున్నారన్న విమర్శలున్నాయి. టీడీపీ వాళ్లు జగన్‌ను మోడీ ఎలా కలుస్తాడంటూ పరోక్షంగా మోడీని తిడుతుంటే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చౌదరి, మంత్రి కామినేని శ్రీనివాసరావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. వీళ్లంతా ఎందుకు స్పందించడం లేదన్న పోస్టును ఐవైఆర్ షేర్ చేశారు. రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇస్తారా? అంటూ పవన్ విమర్శిస్తే.. రాష్ట్ర బీజేపీ అంతా పవన్ మీద విరుచుకుపడింది. మరి వెంకయ్య పాటి విలువ లేదా మోడీకి అంటూ ఈ పోస్టులో చురకలంటించారు. ఒకవిధంగా బీజేపీని వెంకయ్యనాయుడు ‘బాబు జేబు పార్టీ’గా మార్చేశాడని అందులో పేర్కొన్నారు. ఈ పోస్టును ఐవైఆర్ షేర్ చేయడంతో.. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మద్దతుదారులు భావిస్తున్నారు. కులపిచ్చి నేత చంద్రబాబు: చంద్రబాబు కులపిచ్చిని బయటపెట్టిన విదేశీ విద్యార్థిని అన్న మరో పోస్టును సైతం ఐవైఆర్ షేర్ చేశారు. దాంతో పాటు గౌతమిపుత్ర శాతకరి? సినిమాకు టాక్స్ మినహాయింపు ఇవ్వడం పట్ల కూడా ఐవైఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడం టీడీపీకి ఆగ్రహం తెప్పించేదిగా మారింది. ఏ ప్రాతిపదికన ఈ సినిమాకు టాక్స్ మినహాయింపునిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా చరిత్రకారులు ఈ సినిమా చూసి.. చారిత్రకంగా ఇది సరైన సినిమాయే అని నిర్దారించారా? లేదు కదా.. మరలాంటప్పుడు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎలా ఇస్తారని నిలదీశారు. చరిత్రను వక్రీకరించినందుకు సినీ నిర్మాతలకు కోర్టు పెనాల్టీ విధించిందని, మరోవైపు ప్రభుత్వం మాత్రం సినిమాకు రివార్డులు ఇచ్చిందని, ఇలా చేయడం ఎంతవరకు సబబు అంటూ ఆయన ప్రభుత్వానికి అస్త్రాలు ఎక్కుపెట్టారు.
పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను ప్రభుత్వం అరెస్టు చేయించిన నేపథ్యంలో.. గతంలో చంద్రబాబు అండతో ఎన్టీఆర్‌ను కించపరిచేలా వేసిన కార్టూన్స్ మరోసారి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను కించపరి చేలా ఈనాడు వేసిన కార్టూన్స్‌ను ఐవైఆర్ షేర్ చేశారు. ఈ పోస్టులోను చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఉండటంతో.. మొత్తంగా ఆయన అధికార పార్టీకే పక్కలో బల్లెంలా మారుతున్నారని టీడీపీ మద్దతుదారులు అనుమానిస్తున్నారు. ఒకవిధంగా ప్రత్యర్థి పార్టీ వైసీపీకి ఐవైఆర్ ఫ్రీలాన్సర్‌గా వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది టీడీపీ అభిమానులు తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు ముందుకు వస్తున్నట్లు ఐవైఆర్ ప్రకటించడంతో.. వీటిపై ఆయన ఏ వివరణ ఇచ్చుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఐవైఆర్ వ్యవహారంపై టీడీపీ అభిమానులు, మద్దతుదారులు ఫేస్ బుక్ లో ఆయనపై యుద్దమే చేశారు. ఆయన రాజీనామాకు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. విషయాన్ని ప్రభుత్వం దష్టిలోకి తీసుకెళ్లడంలో వారు సఫలమయ్యారు. దీంతో ఐవైఆర్ వైఖరిని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు సర్కార్ ఆయనపై వేటు వేసింది. మరోవైపు ఐవైఆర్ మాత్రం భావ ప్రకటనా స్వేచ్చ కూడా లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మంగళవారం మధ్యాహ్నాం 3గం.కు ఆయన మీడియా ముందు ఇవ్వనున్నారు.


