ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ ఎన్నిక ఏకపక్షమే?
- 12 Views
- admin
- June 22, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు

* విపక్షంలోని జనతాదళ్ యునైటెడ్ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్ష బలం తగ్గిపోయింది. కోవింద్ బిహార్ గవర్నర్‌గా ఇప్పటి వరకుబాధ్యతలు నిర్వహించారు. ఆయనతో నితీశ్‌కు సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. వీటితో పాటు బిహార్‌లో దళితుల జనాభా ఎక్కువగా ఉంది. దీంతో కోవింద్‌కు మద్దతు తెలిపారు. బిహార్‌లో జనతాదళ్ యునైటెడ్, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్ నేతృత్వం వహిస్తున్నారు.
* అన్నాడీఎంకేలోని పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు కూడా ఎన్డీయేకు మద్దతు తెలిపాయి. దీంతో కోవింద్‌కు మద్దతు నిచ్చే సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. పార్లమెంటులోనూ, తమిళనాడు విధానసభలోనూ అన్నాడీఎంకే వర్గాలకు గణనీయమైన సంఖ్యాబలముంది.
*ి దీంతో ఓట్ల పరంగా చూస్తే కోవింద్‌కు ఇప్పటికే ఎలక్ట్రోల్ కాలేజ్‌లోని సభ్యుల్లో 60 శాతం మందికిపైగా మద్దతునిస్తున్నారు. సంఖ్యాబలాన్ని తీసుకుంటే కోవింద్ విజయం ఖాయమని చెప్పవచ్చు.
* ఎస్పీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ కూడా రామ్‌నాథ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించే అవకాశముంది. ఇప్పటికే ఆ సూచనలు కనిపిస్తున్నాయి.
* ఎన్డీయేలోని కీలక పక్షమైన శివసేన రామ్‌నాథ్‌కు సంపూర్ణమద్ధతు తెలిపింది. దీంతో ఆయన విజయంపై ఎలాంటి అనుమానాలు లేవని ఎన్డీయే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
* తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
* రాష్ట్రపతి పదవికి ఇద్దరు దళితనేతలు పోటీపడుతున్న ఎన్నిక ఇదే కావడం విశేషం.
* ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం ఎన్డీయేకు ఉపకరించనుంది. ఉత్తర్‌ప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ దేశంలోనే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో పాటు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్… తదితర పెద్దరాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉంది. దీంతో పాటు జనతాదళ్ యునైటెడ్ అధికారంలో ఉన్న బిహార్, అన్నాడీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడు కూడా ఎన్డీయేకు దన్నుగా నిలవడంతో రామ్‌నాథ్ ఎన్నిక లాంఛనమే.


