ధోనీయే ముద్దు!
- 17 Views
- admin
- June 22, 2017
- Home Slider అంతర్జాతీయం ఆటలు జాతీయం తాజా వార్తలు యువత

తాజాగా ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలవ్వడం, ఆ తర్వాత రెండు రోజులకే కుంబ్లే కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో అవాక్కయిన అభిమానులు వివిధ సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి బాధ్యతలు తీసుకున్న కోహ్లీ తిరిగి అతనికే బాధ్యతలు అప్పగించాలని ఓ అభిమాని కోరగా.. కుంబ్లే రాజీనామాను పరిగణలోనికి తీసుకున్న బీసీసీఐ వెంటనే దాన్ని తిరస్కరించి.. ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించాలని మరొకరు కోరారు. అంతేకాదు ధోనీ సారథిగా ఉన్న సమయంలో జట్టులో మంచి వాతావరణం ఉండేది. కోచ్‌లతో కూడా ధోనీ సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. కోహ్లీ కంటే ధోనీనే మెరుగైన సారథి. బీసీసీఐ వెంటనే కోహ్లీపై చర్యలు తీసుకోవాలి. సారథిగా కోహ్లీ టీమిండియాను నడిపించలేడు. దయచేసి ధోనీని కెప్టెన్‌గా నియమించండి అని వరుస ట్వీట్లతో అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు.


