బిసిసిఐ సీరియస్.. ప్రక్షాళనకు సిద్ధం
- 15 Views
- admin
- June 22, 2017
- Home Slider అంతర్జాతీయం ఆటలు జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఇంతకాలం క్రికెట్‌ని శాసించిన బీసీసీఐ ఇప్పుడు ఎంతో కాలంగా ఇండియన్ క్రికెట్‌కి జాడ్యంగా పట్టుకున్న ఆటగాళ్ళ మధ్య గ్రూపులు, కోచ్‌లతో విభేదాలు. ఆటగాళ్ళ మధ్య వ్యక్తిగత ద్వేషాలని రూపుమాపి సమూల ప్రక్షాళనకి సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు క్రికెట్ బోర్డులో ఉన్న అంతర్గత రాజకీయాలని తగ్గిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు, అందులో కొత్త వ్యక్తులని నియమించింది. ఇప్పుడు వీళ్ళంతా కలిసి. క్రికెట్ టీంలో ఉన్న అంతర్గత రాజకీయ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కోచ్‌గా కుంబ్లేని మరో సీరీస్ వరకు కొనసాగించాలని బీసీసీఐ అనుకున్నా కెప్టెన్ కోహ్లితో వున్న విభేదాల కారణంగా అర్ధంతరంగా రాజీనామా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కారణం ఆటగాళ్ళ క్రమశిక్షణా రాహిత్యం అని భావిస్తున్న బీసీసీఐ వారి మీద ప్రత్యెక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ పూర్తి కాగానే ఈ క్రమశిక్షణా చర్యలకి సిద్ధమయ్యే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తుంది .
అసలు కోచ్‌తో ఆటగాళ్ళు అందరు విభేదించడం. 11 మంది ఆటగాళ్లే గ్రూపులు కట్టడం మీద బోర్డు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. దేశం తరుపున ఆడే సమయంలో బోర్డు నిబంధనలకి లోబడి పని చేయాలి కాని అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు, ఎవరి వ్యక్తిగతంగా వారు ప్రవర్తిస్తామంటే సహించేది లేదని బీసీసీఐ ఇప్పటికే ఆటగాళ్ళని హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మాజీల నుంచి ప్రస్తుతం ఉన్న టీం ఇండియా ఆటగాళ్ళ మీద విమర్శలు వస్తున్నాయి. మాజీలు సైతం సీరియస్‌గా ఆటగాళ్ళకి బీసీసీఐకి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి వెస్టిండిస్ పర్యటనలో ఉన్న ఆటగాళ్ళు ఎలాంటి డిస్టర్బ్ అవకుండా ముందుగా సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తుంది సీరిస్ తర్వాత ఇండియా తిరిగి రాగానే. ప్రతి ఒక్కరిని పిలిచి. వ్యక్తిగతంగా ఆటగాళ్ళుతో మాట్లాడి వివరణ కోరే అవకాశం వుందని, తర్వాత అవసరాన్ని బట్టి ఆటగాళ్ళ వైపు తప్పు వుంటే సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఇకపై ఇండియా క్రికెట్లో జరగబోయే పరిణామాలు ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగిస్తున్నాయి.


