మానవాళిని ముంచుతున్న మధుమేహం ముప్పు
- 20 Views
- admin
- June 22, 2017
- Home Slider తాజా వార్తలు స్థానికం
సంస్కృతి, సాంప్రదాయాన్ని తూలనాడటం ఓ తప్పు
భారత్‌లో పెరుగుతున్న మధుమేహ రోగులు
పెరిగిన పాశ్చాత్య నాగరికం, ఫాస్ట్ఫుడ్స్
ప్రముఖ మధుమేహ నిపుణులు డాక్టర్ కే.దిలీప్ కుమార్
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ప్రపంచ దేశాలతో నవ నాగరికత పేరిట ఉరుకులు, పరుగులతో సముపార్జన, సత్వరాభివృద్ధిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. సొమ్ము మన చెంతనుంటే ఖండ ఖండాంతరాలు 24 గంటల్లో చుట్టేయవచ్చును. నవ నాగరికత పేరుతో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాన్ని తూలనాడి గంగలో కలిపేశారు. పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు, ఆహారపు నియమాలు, శరీరానికి శ్రమలేకపోవడం, లగ్జరీ సౌకర్యాలకు మనుషులు అలవాటుపడటము, లేనిపోని పాశ్చాత్య పోకడల్ని కొని తెచ్చుకోవడము, విభిన్న సంస్కృతులను, ఆచార సాంప్రదాయాలను పూర్తి స్థాయిలో మర్చిపోవడము ఒక ప్రధాన కారణాలుగా భారత్‌లో మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతోందని ప్రముఖ ముధుమేహ నిపుణులు డాక్టర్ కె.దిలీప్‌కుమార్ స్పష్టం చేశారు.
మధుమేహం కారణాలు ఇవి..
భారతీయ సంస్కృతిలో పునర్జీవం, ఆరోగ్యం, అభివృద్ధి, కుటుంబ గౌరవాలు, సంస్కారం, విలువలు, ఓ మంచి ఆలోచనలు అన్నింటికీ మించి ఆరోగ్య రహస్యాలు దాగిఉన్నాయి. ఇవన్నీ కనుమరుగుకావడం వల్ల అనేక సమస్యలు మానవాళి సమాజాన్ని పలు రోగాలు పట్టి పీడిస్తున్నాయి. ఉదాహరణకు వారంలో ఉపవాసం ఉండాలి. ఆహార నియమం చేయాలి. ఆచార, సాంప్రదాయాల్లో పలు పద్ధతులు పాటించాలి. ఆకు కూరలు తినాలి. కలకల్పిన ఆహారం తీసుకోవాలి. వ్యవహారాలు, ఆచారాలలో శాస్త్రీయ దృక్పథం దాగి ఉంది. అందువల్ల అంతా మేలు జరిగేది. ఈనాడు సాంప్రదాయాలు మరిచిపోయి సరైన ఆహార నియమావళి లేక తినే పదార్ధాలు కల్తీలమయమై, మధుమేహం వంటి రోగాలు మనుషుల్లో పెరుగుతున్నాయి. కొవ్వు పదార్ధాలు, జంకుఫుడ్స్, ఫాస్టుఫుడ్స్, బజారులో లభించే పానియాలు, డైరీ ప్రొడక్ట్సు, శారీరక వ్రమ లేకపోవడం, అనుదినం శారీరక, మానసిక ఒత్తిళ్లు, దీనికి తోడుగా అనువంశపరంగా మధుమేహానికి మరింత హెచ్చింపజేస్తోంది.
ప్రశ్న: మధుమేహం వల్ల జరిగే ప్రమాదం ఏమిటి?
డాక్టర్: జీవన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. కిడ్నీల మీద భారం పడుతుంది. క్రమేనా కంటిచూపు కోల్పోవడం జరుగుతుంది. పలు అనారోగ్యాలకు దారితీసి మనిషిక కుంగదీస్తుంది. వంశ పరంగా లేకపోయినా వస్తుంది. తగిన వైద్యుని సలహా మేరకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని వ్యాధి తీవ్రత పెరగకుండా మందులు వాడాలి. ఆహార నియమాలు పాటించాల్సి ఉంది.
ప్రశ్న: ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డాక్టర్: ప్రతీరోజూ వ్యాయామం, ఉదయం, సాయంత్రము క్రమం తప్పని నడక, శారీరక శ్రమ ఎంతో అవసరం.
ప్రశ్న: మానుకోవాల్సిన పదార్ధాలు, పానియాలు?
డాక్టర్: క్రొవ్వు పదార్ధాలు, అతిగా నూనె ఉన్న ఆహారాలు, దుంపకూరలు, పండ్ల రసాలు, స్వీట్లు, మద్యం సేవించడం, పొగాకు ఉత్పత్తులు స్వీకరించడం మానేయాలి
ప్రశ్న: తినేవి ఏమిటి?
డాక్టర్: గోధమపిండి నూనెలేని పదార్ధాలు, పుల్కాలు, పీచుపదార్ధాలు, ఆకు కూరలు, రైస్ తక్కువగా తీసుకోవాలి. ఆందోళనపడకుండా వీలున్నంత వరకూ దైవికంగా, ప్రశాంతంగా గడపాలి. ఉదయం, సాయంత్రం వేళలో నడకకు ప్రాధాన్యత ఇవ్వాలి. సాఫ్టు డ్రింకుల జోలికి పోరాదు. వైద్యుని సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న: ఇంకా ఎలాంటి జాగ్రత్తలు, ఆహారం వాడాలి?
డాక్టర్: దంపుడు బియ్యం, జొన్నరొట్టెలు ఆహారంగా తీసుకుంటే శరీరంలోని ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది. వీలైనంత వరకూ పాలిష్ రైస్ వినియోగించకుండా ఉండాలి. గోధుమ పుల్కాలు, జొన్నరొట్టెలు చాలా శ్రేయస్సుకరమని తెలుసుకోవాలి. రెండు లేక మూడు నెలలకోసారి హెచ్బీఏసీ వైద్య పరీక్షలతో మధుమేహా వ్యాధిని నిర్ధారించుకోవచ్చును. మనం ప్రతీరోజూ త్రాగేనీళ్లు సురక్షితమైనవిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వ్యాధులు తాగేనీళ్లు వల్లే వచ్చే అవకాశాలు ఉన్నాయి. తీపి పదార్ధాలైన స్వీట్లు వంటి ఆహారపదార్ధాల జోలికి పోకుండా సంపూర్ణ ఆరోగ్యానికి మనకు మనమే నిర్ణయాలు తీసుకొని మధుమేహం వంటి రుగ్మతలకు దూరంగా ఉండాలి.


