కరీంనగర్, అమరావతి.. స్మార్ట్‌సిటీలు
- 18 Views
- admin
- June 23, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం

దేశవ్యాప్తంగా 100 నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్‌సిటీస్ మిషన్‌ను 2015లో ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిదశలో భాగంగా 20 నగరాల జాబితాను 2016 జనవరిలో విడుదల చేశారు. ఆ తర్వాత తొలిదశను అప్‌గ్రేడ్ చేస్తూ.. మరో 13 నగరాలను జాబితాలో చేర్చారు. రెండో దశలో 27 నగరాలను ఎంపికచేశారు. చివరి దశ కింద శుక్రవారం 40 నగరాల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఇందుకోసం 45 నగరాలు పోటీపడ్డాయి.
అయితే ఈ దశలో కేవలం 30 నగరాలు మాత్రమే ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మిగతా వాటిని మరోసారి వెల్లడిస్తామన్నారు. తాజా జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం, ఛత్తీస్‌గఢ్ కొత్త రాజధాని నయా రాయ్‌పూర్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. జమ్ముకశ్మీర్ రెండు రాజధానులు జమ్ము, శ్రీనగర్, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ జాబితాలో చోటుదక్కించుకున్నాయి.
మూడో దశ స్మార్ట్ సిటీస్ జాబితా ఇదే
1. తిరువనంతపురం
2. నయా రాయ్‌పూర్
3. రాజ్‌కోట్
4. అమరావతి
5. పట్నా
6. కరీంనగర్
7. ముజఫర్‌నగర్
8. పుదుచ్చేరీ
9. గాంధీనగర్
10. శ్రీనగర్
11. సాగర్
12. కర్నల్
13. సత్నా
14. బెంగళూరు
15. సిమ్లా
16. డెహ్రాడూన్
17. తిరుప్పూర్
18. పింప్రీ చించ్వద్
19. బిలాస్పూర్
20. పాశిఘాట్
21. జమ్ము
22. దాహోద్
23. తిరునెల్వేలి
24. తూతుకుడి
25. తిరుచురాపల్లి
26. ఝాన్సీ
27. ఐజల్
28. అలహాబాద్
29. అలిగఢ్
30. గ్యాంగ్‌టక్


