జయహో ఇస్రో
- 10 Views
- admin
- June 23, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
31 ఉపగ్రహాలతో సగర్వంగా నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ38
నెల్లూరు, ఫీచర్స్ ఇండియా: నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పోలార్ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్ఎల్వీ)- సీ38 సగర్వంగా నింగికెగసింది. 31 ఉపగ్రహాలతో భారత కీర్తిపతాకను రెపరెపలాడిస్తూ పీఎస్ఎల్వీ-సీ38 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. ఈ 17వ ప్రయోగం ద్వారా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సహా మరో 8 దేశాలకు చెందిన ఉపగ్రహాలతో పాటు మన దేశానికి చెందిన కార్టోశాట్-2ఇ, తమిళనాడులోని నూరుల్ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని భూమికి 505 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
మనదేశానికి చెందిన కార్టోశాట్-2ఇ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలందిస్తుంది. భూ పరిశీలన చేయనున్న ఈ ఉపగ్రహం సమగ్ర మ్యాపింగ్ తోపాటు భూగఠజేలాల సమాచారంతో పాటు సముద్రతీరంలోని నిక్షిప్తమై ఉన్న వనరుల వివరాలు అందించనుంది. దీని బరువు 712 కేజీలు కాగా, మిగిలిన 30 నానో ఉపగ్రహాల బరువు కేవలం 243 కేజీలు.
సక్సెస్… చరిత్ర నెలకొల్పాం…
50 రోజుల్లో మూడు ప్రయోగాలు విజయవంతంగా చేశాం: ఇస్రో
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పోలార్ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్ఎల్వీ)- సీ38 ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర నెలకొల్పిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గడచిన రెండు నెలల కాలంలో 50 రోజులు ఇస్రోకు చాలా క్లిష్టమైన సమయమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే ఈ 50 రోజులలో ఇస్రో మూడు అంతరిక్ష ప్రయోగాలు చేసిందని గుర్తుచేశారు. మూడు ప్రయోగాలు అత్యంత భారీ వ్యయంతో కూడినవని, ప్రతిషా’త్మకంగా భావించి, మూడు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని వారు తెలిపారు. ఈ విజయం ఇస్రోకు మరింత స్పూర్తినివ్వగా, ఇస్రో ఖ్యాతిని మరింతగా పెంచిందని వారు అభిప్రాయపడ్డారు.


