పబ్లిక్ హెల్త్ ఛీఫ్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ దాడులు
- 10 Views
- admin
- June 23, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం క్రైం, ఫీచర్స్ ఇండియా : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఛీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పాముల రంగారావు ఆదాయానికి మించిన ఆస్థులు కలిగి ఉండటంతో అతని ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివరాలోకి వెళితే రంగారావు ఆంధ్ర మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బీ విజయకుమార్‌తో కలిసి సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మిస్తున్నాడు. దీంతో రంగారావుపై దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు మాధవధారలో ఉన్న రంగారావు ఇంటిపై అలాగే మాధవధార, ఉడాకాలనీ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ బీ విజయకుమార్ ఇంటిపైనా, దీంతో పాటు వారికి సంబంధించిన 14 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేపట్టారు. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు అక్రమ ఆస్థుల వివరాలు వెల్లడించలేదు. ఈ విషయమై విశాఖ ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ను ఫీచర్స్ ఇండియా వివరణ కోరగా, ఈ దాడులను విజయవాడ డివిజన్‌కు చెందిన ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నారని, దాడులు వివరాలు వారే తెలియజేస్తారని తెలిపారు.


