ప్రభుత్వ ఆచరణలో నిరుపేద దళితులకు భూ పంపిణీ జరగాలి
- 24 Views
- admin
- June 23, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
పారదర్శకత గల భూ పంపిణీ జరగాలి – రెవెన్యూశాఖ అజమాయిషీకి కళ్లెం వేయాలి
అంబేద్కర్ ఆశయాలు.. బాబు ఆచరణలు నిజం చేయాలి
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : భారతదేశ జనాభాలో స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నప్పటికీ 29శాతం మంది దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారని ప్రభుత్వ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంబేద్కర్ ఆశించిన సమసమాజ స్థాపనకు నేటి దాకా ఎన్నికైన ప్రజా పాలకులు ప్రయత్నాలు చేసారు. అయినప్పటికీ నిరుపేదలు, దళితులు ఇంకా దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారు. ఇది వారి శాప ఫలితమైతే కాదు. పాలకుల అలసత్వం, పటిష్టమైన క్షేత్రస్థాయి కారాచర్యరణలు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. అవినీతి, కుంభకోణాల్లో భారత్ 132 స్థానములో ఉంది. అవినీతి పరుల్ని నిలువరించగల్గితే దేశములోని నిరుపేదలకు ప్రభుత్వాలు కూడు, గూడు కల్పించి అభివృద్ధిలో నడపవచ్చును. తేదేపా ప్రభుత్వం తీసుకున్న సముచిత నిర్ణయాల వల్ల నిరుపేద దళిత మహిళలు, భూమి యజమానులు కావడం చాలా హర్షించదగిన అంశము. అయితే భారత్లో ఎక్కడా లేని విధంగా భూ పంపిణీని ప్రభుత్వం పెద్ద సవాలుగా ఉండబోతోంది. ఎందుకంటే క్షేత్ర, మండల, జిల్లా స్థాయిల కమిటీల నిర్ణయాల మేరకు గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వం అనుకున్న ధరలకు కొనుగోలు చేసి వాటికి పక్కా డాక్యుమెంట్లు ఎర్పరిచి నిజ నిరుపేదలకు భూముల పంపిణీ జరిగినపుడే అంబేద్కర్ ఆశించిన గ్రామస్థాయి అభివృద్ధి సాధించి సమ సమాజానికి నాంది పలకడము జరుగుతుంది. ఎన్నో సవాళ్లను స్వీకరించి నిరుపేదలకు అండగా ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను అధినాయకత్వం ముందకు తీసుకెళ్లాల్సిన గురుతర భాద్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం 2వేల 177కోట్ల రూపాయలతో క్షేత్రస్థాయి కార్యాచరణకు సిద్ధం చేసింది. 20లక్షల దళితుల్ని లబ్దిదారులుగా చేయడం ప్రధానాంశంగా ఉంది. దీని కోసం షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ అధ్యక్షులు జూపూడి ప్రభాకరరావు సారధ్యంలో ఇప్పటికే జిల్లాల వారీగా అవగాహన సదస్సులు, ప్రభుత్వ సమన్వయ సదస్సులు సమగ్ర కార్యాచరణకు శ్రీకారం జరుగుతుంది. తేదేపా ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం 2017-18 రెండేళ్ల కాలంలో రూ.2176.99కోట్లు కేటాయించారు. 1,26,519 మంది ఎస్సీ లబ్దిదారులను పరిగణలోకి తీసుకొని వీరికి లబ్దిని చేకూరేలా చేస్తారు. ప్రత్యేకించి భూమి కొనుగోలు పథకం కింద రెండువేల మందికి ఒక్కొక్కరికి రెండు ఎకరాలు చొప్పున 4వేల ఎకరాలు భూ పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.150కోట్లు సబ్సిడిని ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి రూ.50కోట్లు వడ్డీలేని రుణాలు అందజేస్తారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి పారిశుధ్య కార్మికులకు ట్రాక్టర్లు, 200 ఇన్నోవా కార్లు, 100 పాసింజర్ కార్లు పంపిణీ చేసి దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ఎస్సీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇతర సామాజికాభివృద్ధి, విద్య, ఆర్ధిక ప్రణాళిక దళితులకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ప్రతీ ఇంటికి నిజమైన అర్హులకు ఫలితాలు అందాలి. అప్పుడే అంబేద్కర్ ఆశించిన దళితుల అభివృద్ధి సాధ్యమౌతుంది. చంద్రబాబు ప్రభుత్వ కార్యాచరణకు అర్ధం ఉంటుంది. మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీల విస్తృత సమాలోచనలతో దళితులకు ఆస్థుల పంపిణీలో కీలక పాత్ర వహించాల్సి ఉంది. ఎలాంటి రాజకీయ పైరవీలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వ లక్ష్యాలను పటిష్టంగా సమగ్ర దళితాభివృద్ధికి ప్రోత్సాహకాలు అందిస్తే ప్రభుత్వ ఆశయాలు నెరవేరుతాయి. రెవెన్యూ కింది స్థాయి ఉద్యోగుల అజమాయిషీకి కళ్లెం వేసి క్షేత్రస్థాయిలో పారదర్శకత కలిగిన నిజ నిరుపేద దళిత కుటుంబాలకు న్యాయం జరగాలని పలు దళిత, ప్రజాసంఘాలు ఆశిస్తున్నాయి.


