హీరోయిజాన్ని తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరిండంలో దర్శకుడు హరీష్శంకర్ది ప్రత్యేక శైలి. ఇదే సూత్రాన్ని ఆపాదించి రూపొందించిన గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి ఆయనను స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేర్చింది. హరీష్‌శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథమ్. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందఠంగా దర్శకుడు హరీష్‌శంకర్ గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.
అల్లు అర్జున్‌తో సినిమా మీ డ్రీమ్ అన్నారు. డీజేతో ఆ కల నెరవేరినట్టేనా?
-నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా చూశాను. ఇలాంటి ఎనర్జి వున్న హీరో, దేవీశ్రీప్రసాద్ లాంటి సంగీత దర్శకుడు, కొత్త దర్శకుడైనా ఖర్చుకు వెనకాడకుండా నిర్మించే దిల్‌రాజు… ఈ ముగ్గురు వ్యక్తులతో కలిసి ఎప్పటికైనా ఓ సినిమా చేయాలని అప్పడే గట్టిగా నిర?యించుకున్నాను. ఆ కల ఇన్నేళ్లకు డీజేతో నెరవేరడం ఆనందందగా వుంది.
స్టెలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌తో బ్రాహ్మణ యువకుడి పాత్రను చేయించడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా వుందా?
-(నవ్వుతూ.) బ్రాహ్మణులు కూడా ట్కస్టెల్గా వుంటారని నా అభిప్రాయం. దువ్వాడ జగన్నాథమ్ అంటే సినిమా అంతా ఎంటర్టైనింగ్గా సాగుతుందని ఊహిస్తారు. కానీ దానికి మించి ఊహించని విధంగా చక్కని భావోద్వేగాలతో సాగుతుంది. ఇంతకు ముందు నా సినిమాల్లో స్ప శించని అంశాల్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాను. అందుకే ఈ చిత్రానికి డీజే అని పెట్టాను. అల్లు అర్జున్ ట్కస్టెలిష్స్టార్ కాబట్టి డీజే అని పెట్టాం. అల్లు అర్జున్ నటించిన గత చిత్రాల కంటే ట్కస్టెలిష్గా వుంటుంది.
పవన్‌కల్యాణ్ సూార్తిేతో సినిమాలో ఓ డైలాగ్ రాశానన్నారు. ఆయనతో మళ్లీ సినిమా చేయబోతున్నారా?
-పవన్‌కల్యాణ్‌ను కలిసి దాదాపు మూడు నెలలవుతోంది. ఆయన కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాను.
గతంలో చిరంజీవితోనూ సినిమా చేస్తానని అన్నారు?
-చిరంజీవిగారితో సినిమా ఖచ్చితంగా చేస్తాను. ఆయనతో దొంగమొగుడు, రౌడీఅల్లుడు, గ్యాంగ్‌లీడర్ చిత్రాల తరహాలో కొత్త పంథాలో ఓ సినిమా చేయాలనే ఆలోచన వుంది. దొంగమొగుడు, రౌడీఅల్లుడు, గ్యాంగ్‌లీడర్ చిత్రాలు వచ్చి చాలా ఏళ్లవుతున్నా వీటి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఆయనతో సినిమా చేస్తే ఇలాగే మాట్లాడుకోవాలి. అలాంటి సినిమానే చిరంజీవితో చేయాలనుకుంటున్నాను.
జెంటిల్మెన్, అపరిచితుడు చిత్రాలని తలపించేలా సినిమా వుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి?
-అంకుశం సూపర్‌డూపర్ హిట్ అయింది కదా అని గబ్బర్‌సింగ్ రాకుండా ఆగలేదు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది కదా అని పటాస్ రాకుండా ఆగలేదు. పటాస్ వచ్చింది కదా అని పోలీస్ కథతో రాధ తీయడం మానలేదు. ఒక పాత్రను ఓ హీరో చేసినప్పుడు అదే తరహా పాత్రను మా హీరో చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటారు. ఒకరు చేశారు కదా అని మరొకరు చేయకుండా వుంటారా? వుండరు కదా. బ్రాహ్మణ యువకుడి నేపథ్యంలో తక్కువ సినిమాలు వచ్చాయి కాబట్టి డీజేను ఇతర సినిమాలతో పోల్చి చూస్తున్నారు. కానీ ఆ సినిమాలకు డీజేకు ఎలాంటి సంబంధం లేదు.
అభిమానం పేరుతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకోవడం ఎక్కువైపోతోంది. దీని గురించి మీరేమంటారు?
-సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తరువాత కొంత ఇబ్బందికరమైన సంఘటనలు, ట్వీట్లు ఎదురవుతున్నాయి. నేను చదువుకునే రోజుల్లో అభిమానం అనేది ఆరోగ్యకరంగా వుండేది. కానీ ఇప్పుడా పరిస్థితిలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక హీరో ఫొటోను మరో హీరో ఫొటోతో మారీంగ్ చేయడం వంటి వింత ధోరణి ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ అనేది ఇలాంటి వాళ్లకు ఎలా ఉపయోగపడుతుందో మిగతా వాళ్ల్లకు కూడా అలాగే ఉపయోగపడుతుందనే విషయం అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా వేదికగా వింత వింత పోస్ట్‌లు పెట్టే వాళ్లు ఎలాంటి భాషను మాట్లాడితే బాగుంటుందనేది వాళ్ల సంస్కారానికే వదిలేస్తున్నాను.
నిర్మాతగా మారుతున్నారని తెలిసింది?
-కొన్ని సినిమాలు చేయాలనుకున్నా మాకున్న కమిట్మెంట్ల కారణంగా, పరిధుల వల్ల నచ్చిన కథలతో సినిమాలు తీయలేకపోతున్నాం. అలాంటి సినిమాలు తీసే సమయం కూడా కొన్ని సందరాÄల్లోే కుదరడం లేదు. నాకు నచ్చిన కథలతో ఎవరు వచ్చినా వాళ్లతో సినిమాలు నిర్మించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.
మీ తదుపరి చిత్రం ఎవరితో వుంటుంది?
-ఇంకా హీరో ఎవరనేది అనుకోలేదు. దిల్‌రాజు సంస్థలోనే నా తదుపరి చిత్రం వుంటుంది. ఆయన సంస్థ నుంచి సినిమా అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ తరహా కథతో మానవ సంబంధాల నేపథ్యంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నాను. హింసాత్మక సన్నివేశాలు లేని క్లీన్ ఎంటర్టైనర్గా సినిమా వుంటుంది.
డీజే కోసం అల్లు అర్జున్ శాకాహారిగా మారారని తెలిసింది?
-అల్లు అర్జున్ ఏ పాత్ర చేసినా ప్రత్యేక శ్రద్దతీసుకుంటారు. సినిమాలో ఆయన పాత్ర ఎలా వుంటుందో చెప్పిన తరువాత ఒక రోజు ఫోన్ చేసి గుడిలో పౌరోహిత్యం చేసేవాళ్లు ఒకలా.., వంట చేసే బ్రాహ్మణులు…, బడిలో పాఠాలు చెప్పే వాళ్లు మరోలా మాట్లాడుతున్నారు. టీవీల్లో ప్రవచనాలు చెప్పేవాళ్లు మరో విధంగా మాట్లాడుతున్నారు. ఇందులో నేను ఎవరిని అనుసరించాలి అన్నారు. పాత్ర రాసిన నేను కూడా ఇంత పరిశోధించలేదు. డైలాగ్స్ రాసుకున్న తరువాత ఒక స్లాంగ్ అనుకుందాం అని ఆయనతో చెప్పాను. ఆ తరువాత ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ చాలా శ్రమించారు.