పూరీ: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ క్షేత్రంలో అశేష భక్తజనావళి జైజగన్నాథ నినాదాల మధ్య జగన్నాథుని రథయాత్కర ప్రారంభంమైంది. పూరీ సంస్థానాధీశుడు ప్రధాన అర్చకుడి వద్ద నుంచి సూచన రాగానే లాంఛనంగా రథాన్ని కదలించారు. ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో పూరీ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు అసంఖ్యాక భక్తులతో పూరీ కిటకిటలాడుతుండటంతో పోలీసు యంత్రాంగం సర్వత్రా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆయా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.