నరేంద్రమోదీకి ట్రంప్ ఘన స్వాగతం స్వాగతం
- 14 Views
- admin
- June 25, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

ఇప్పటికే ఇరు దేశాధ్యక్షులు మూడుసార్లు ఫోన్లో ముచ్చటించుకున్నారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ముఖాముఖిగా కలుసుకోబోతున్నారు. దాంతో ఈ ప్రత్యేక సమావేశానికి విశేషమైన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య మరింత బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాడతాయని అక్కడి సీనియర్ అధికారులు కొందరు భావిస్తున్నారు. వాణిజ్య సంబంధం, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైన విషయాలు వీరి భేటీలో చర్చకు రానున్నాయి. హెచ్1 బీ వీసా అంశంపై భారత్ అభ్యర్థిస్తే ఆ అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం సానుకూల సంకేతాలు పంపించింది.
ఇప్పటికే 22 మానరహిత గార్డియన్ డ్రోన్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపినట్లు సమాచారం. సుమారు 2 నుంచి 3 బిలియన్ డాలర్లతో కూడిన ఈ ఒప్పందానికి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంపైన ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.
రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధంలో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌తో అధికారికంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికేందుకు శ్వేతసౌధం అన్ని ఏర్పాట్లు చేసింది. మోదీ కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. శ్వేతసౌధంలో ట్రంప్ విదేశీ నేతలకు ఇచ్చే విందు మోదీతోనే ప్రారంభం కానుండం విశేషం.


