148 మంది ప్రాణాలు తీసిన ఆయిల్ ట్యాంకర్
- 10 Views
- admin
- June 25, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు

ఇంధనం కోసం వెళ్లి సజీవదహనం..
ట్యాంకర్ బోల్తా పడడంతో రహదారిపై భారీగా ఇంధనం లీకైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా బకెట్లతో ఇంధనం తోడుకోవడానికి ఘటనాస్థలికి వచ్చారు. ఇంతలో ట్యాంకర్ పేలిపోవడంతో అక్కడున్నవారంతా దుర్మరణం చెందారు. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపుచేశారు.
హెలికాప్టర్లలో క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానికులు ఆయిల్ తోడుకుంటుండగా.. ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించడంతో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. చుట్టు పక్కల నిలిపివున్న కార్లు, ద్విచక్రవాహనాలు కూడా దగ్ధమయ్యాయి. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ముద్దలా మారిపోవడంతో వారిని గుర్తించలేకపోతున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసులు హెచ్చరిస్తున్నా వినిపించుకోలేదు
ట్యాంకర్ బోల్తాపడగానే వేల లీటర్ల ఆయిల్ రోడ్లుపై లీకైంది. దాంతోపరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆయిల్ తోడుకోవడానికి కుండలు, బకెట్లతో గుమిగూడారు. అప్పటికీ పోలీసులు వారిని అదుపుచేస్తూ దూరంగా ఉండమని హెచ్చరించారు. అయినా వారెవరూ వినిపించుకోలేదు. అందులోనూ ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం.


