ఇంటర్నెట్‌డెస్క్: ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన అభిరుచి, ఆసక్తి ఉంటాయి. కొందరైతే మరీ విచిత్రంగా ఉంటారు. అందరి కంటే విభిన్నంగా ఉండాలని పరితపిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. చైనాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాంటి పనే ఒకటి చేశాడు. ప్రచారం ఎక్కువగా లభించాలనే ఉద్దేశంతో 50 పచ్చి కోడిగుడ్లను కేవలం 17 సెకన్లలో మింగేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 5 మగ్గుల్లో ఒక్కో మగ్గుకి 10 గుడ్లు చొప్పున ఎలాంటి సంకోచం లేకుండా అలవోకగా తాగేశాడు. ఇదంతా తన సోషల్‌మీడియా ఖాతా లైవ్‌స్ట్రీమింగ్ ద్వారానే చేయడం విశేషం. ఈ విషయాన్ని డైలీ మెయిల్ వార్తా సంస్థ వెల్లడించింది. సోషల్‌మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారని డైలీ మెయిల్ పేర్కొంది.