డివైడర్ను ఢీ కొని క్రిందకు పడ్డ విశాఖ డెయిరీ లారీ.. నేలపాలైన పాలకోసం ప్రజల పరుగులు
- 19 Views
- admin
- June 27, 2017
- Home Slider తాజా వార్తలు స్థానికం
గాజువాక, ఫీచర్స్ ఇండియా : పిఠాపురం నుండి విశాఖ డెయిరీకి వస్తున్న పాల వ్యాను మంగళవారం వేకువజామున సుమారు నాలుగు గంటల సమయంలో బోల్తాపడింది. గాజువాక వడ్లపూడి బ్రిడ్జి మీద డివైడర్ ను డీ కొని బ్రిడ్జి మీదనుండి కిందకు దూసుకెళ్లింది. ట్యాంక్లో పాలు ఉండడంతో పాలు నేలపాలయ్యాయి. పాలు కోసం పరుగులు తీసిన ప్రజలు, బిందెలు, బకెట్లతో పాలు తీసుకెళ్లారు. తెల్లవారు జామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెపుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవరుకు తీవ్రగాలు గాయలు కావడంతో గాజువాక పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గాజువాక పొలీసులు గాయాలతో ఉన్న లారీ డ్రైవరును స్థానిక హాస్పటల్ కు తరలించారు. విశాఖ డెయిరీ వారూ వెంటనే సంఘటనా స్థలానికి వెరొక లారీని పంపి పాలను తరలించారు .గాజువాక పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


