రాష్ట్రపతి ఎన్నికకూ ఓ లెక్కుంది!
- 12 Views
- admin
- June 27, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
మన దేశంలో రాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా ఉంటుంది. పరోక్ష పద్దతిలో ఎన్నిక నిర్వహిస్తారు.
రాష్ట్రపతి ఎన్నిక..
రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్ట్రోరల్ కాలేజి ఉంటుంది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం విధానసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. నామినేటడ్ సభ్యులకు ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉండదు.
రాజ్యసభ – 233
లోక్‌సభ – 543
ఎమ్మెల్యేలు (దేశవ్యాప్తంగా)- 4120
మొత్తం ఓటర్ల సంఖ్య – 4896
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓట్లను ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై రాజ్యాంగంలో అన్ని అంశాలను పొందుపరిచారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటును ఇతర ఓటుతో పాటు కలిపి ఒకటిగా పరిగణిస్తారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్ల విలువ మారుతుంది. ఎంపీ ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాను బట్టి మారుతుంది. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. ఉదా: ఉత్తర్‌ప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ జనాభా ఎక్కువగా ఉండటంతో ఓటు విలువ కూడా ఎక్కువే. అదే సమయంలో సిక్కింలో జనాభా తక్కువగా ఉంటుంది. అందుకనే ఓటు విలువ తక్కువే.
మొత్తం ఓట్ల విలువ 10,98,903
ఓటు విలువ అంశానికొస్తే ఎంపీ ఓటు విలువ ఒకటే. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించినా నాగాలాండ్ నుంచి ఎన్నికయినా ఎంపీ ఓటు విలువ ఒక్కటే కావడం గమనార్హం. అదే రాష్ట్రాలకు వచ్చేసరికి ఎమ్మెల్యేల ఓటు విలువ జనాభా ఆధారంగా మారుతుంది. మొత్తం ఓట్ల విలువ 10,98,903గా లెక్కిస్తారు. ఇందులో ఎంపీల ఓట్ల విలువ 5,49,408 కాగా ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,49,495గా ఉంది.
జనాభా ఉన్న రాష్ట్రాల ఓట్లు కీలకం
జనాభాపరంగా పెద్దరాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ్‌బంగా, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్… తదితర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల ఓట్లు విలువ ఎక్కువగా ఉంటుంది.
కోవింద్ ఎన్నిక ఏకపక్షమే..
బిహార్‌లోని అధికార కూటమిలో కీలక భాగస్వామి జనతాదళ్ యునైటెడ్ ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుందని ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ ప్రకటించడంతో ఎన్డీయేకు మరింత బలాన్ని చేకూర్చింది. తమిళనాడులోని అన్నాడీఎంకే వర్గాలు కూడా కోవింద్‌కు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రసమితి సభ్యులు కోవింద్‌కు ఓటు వేస్తారని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ఇదివరకే ప్రకటించారు. ఒడిశా అధికారపక్షం బిజూ జనతాదళ్ కూడా ఎన్డీయేకు అనుకూలంగా ఉంది. దీంతో కోవింద్ ఎన్నిక ఏకపక్షమే అని రాజకీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు. యూపీఏ అభ్యర్థిగా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ పోటీ చేస్తున్నారు.


