గురువారం జీశాట్-17 ప్రయోగం
- 11 Views
- admin
- June 28, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
శ్రీహరికోట: వరుస విజయాలతో ఉత్సాహం మీదున్న భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) నెలరోజుల వ్యవధిలోనే మూడో ప్రయోగానికి సిద్ధమైంది. కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-17ని ఏరియన్‌స్పేస్-5ఈసీఏ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానా అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి పరీక్షించనున్నారు. ఈనెల 5న ఇస్రో బాహుబలి రాకెట్ జీశాట్-19 ప్రయోగించిన విషయం తెలిసిందే. అదే వరుసలో.. 3425 కిలోల బరువు మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న జీశాట్-17ను భారత కాలప్రకారం గురువారం తెల్లవారుజామున 2:29 గంటలకు ఫ్రెంచ్‌గయానాలోని ఐదవ లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నారు.
భూస్థిర కక్ష్యలోకి ప్రవేశించే ఈ ఉపగ్రహం 15 ఏండ్లపాటు సేవలందించనుంది. కమ్యూనికేషన్ సేవలు, డేటా ప్రసారాలు, సహాయకచర్యలకు ఇది ఉపకరించనుంది. 3.4టన్నుల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే సదుపాయాలు మనవద్ద లేనందున గయానా నుంచి దీనిని ప్రయోగిస్తున్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1 ఉపగ్రహంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. గడియారాలేవీ పనిచేయడంలేదు. దానిని మార్చేందుకే జీశాట్-17ని ప్రయోగిస్తున్నాం అని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ తెలిపారు. ఏడాదికి 8 నుంచి 10 పీఎస్ఎల్వీ ప్రయోగాలతోపాటు రెండేసి మార్క్-2, మార్క్-3 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.


