
ఇదివరకు బీకామ్ చదివిన విద్యార్థుల్లో దాదాపు 5 నుంచి 10 శాతం వరకు మాత్రమే జాబ్స్ సాధించేవారు. మిగితా వారు వేరే జాబ్స్ వెతుక్కోవడం, సీఏ, ఎంబీఏ లాంటి పెద్ద చదువులు చదవడం లాంటివి చేసేవారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓ సంవత్సరం నుంచి కామర్స్ గ్రాడ్యుయేట్లకు గిరాకీ పెరుగుతున్నది. అంతే కాదు.. ఓ 6 నెలల కింద కామర్స్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ కు నెలకు రూ. 15000 సాలరీ ప్యాకేజీ ఉండేదట. ఇప్పుడు మాత్రం రూ. 20,000 సాలరీ కి ఎగబాకిందట. జీఎస్టీ మీద మంచి గ్రిప్ ఉంటే దాదాపు రూ. 30,000 ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదట కంపెనీలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. బీకామ్ గ్రాడ్యుయేట్లకు ఎంత డిమాండ్ ఉందో. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ బీకామ్ గ్రాడ్యుయేట్స్ కు డిమాండ్ పెరగనుందట.
త్వరలో జీఎస్టీ మీద క్రాష్ కోర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ కామర్స్ గ్రాడ్యుయేట్స్ జీఎస్టీ క్రాష్ కోర్స్ నేర్చుకొని మార్కెట్లోకి వస్తే వాళ్లను కళ్లకద్దుకొని కంపెనీ తీసుకోనున్నట్లు ఓ సీఏ వెల్లడించాడు. కంపెనీలకు జీఎస్టీ పై అవగాహన ఉన్న కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయితే జాబ్ లోకి తీసుకున్నాక వాళ్లకు ట్రెయినింగ్ ఇవ్వాల్సిన పని ఉండదని.. దీంతో డైరెక్ట్ గా వాళ్లకు వర్క్ అసైన్ చేయొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఇంకెందుకు ఆలస్యం.. జీఎస్టీ పై కొంచెం అవగాహన పెంచుకొని మంచి ప్యాకేజీతో జాబ్ కొట్టేయండి మరి.