కంటిచూపు దేవడిచ్చిన వరం.. శ్రద్ధ వహిద్దాం..
- 28 Views
- admin
- July 3, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
చంటి పపల్లా.. కనుపాపల్ని కాపాడుకోవాలి ` మేనరికం పెళ్లిళ్ల్లతో అంగవైకల్యం
గోల్డెన్ సమయాన్ని సద్వినియోగపర్చుకోవాలి ` డా|| అగర్వాల్స్ కంటి ఆసుపత్రి కన్సల్టెంట్ డా||జేమ్స్ సుభ్రత్కుమార్ ఆడమ్స్
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : మానవ జీవితాలకు కంటి చూపు దేవుడిచ్చిన వరం. ప్రపంచం పురోగమానికి, అందమైన, ఆధునిక సమాజాన్ని, అంతకంటే ముఖ్యంగా దేవుడు సృష్టించిన అందాల్ని తనివితీరా చూసి నయనానందాన్ని పొందాలంటే మనిషికి ప్రధానమైనవి కళ్లు. దేన్ని నిర్లక్ష్యం చేసినా క్షమార్పణ వుంది. కాని అతి సున్నితమైన, మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కళ్లు అతి కీలకమైనవి. చిన్నారులు, పెద్దలు, మహిళామణులు కళ్లపైనే ఆధారపడాలి. అటువంటి కంటిని దేవుడు మనకిచ్చిన వరాన్ని, అద్భుతమైన అవకాశాన్ని, మానవ తప్పిదాలకు గురికాకుండా గురుతర బాధ్యతతో కాపాడుకోవాల్సిన అవసరం అందరిలో ఉందని విశాఖ డా|| అగర్వాల్ కంటి ఆసుపత్రి కన్సల్టెంట్, విట్రియో రెటీనల్ సర్జన్ ప్రముఖ కంటి వైద్యు నిపుణులు డా||జేమ్స్ సుభ్రత్ కుమార్ ఆడమ్స్ ఫీచర్స్ ఇండియాతో ముఖాముఖిగా ముచ్చటించారు.
సమాజంలో ఎదురౌతున్న పలు సమస్యలు కంటి చూపుపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఆహార నియమాలు, పరిసరాల పరిశుభ్రత , పెరుగుతున్న కాలుష్యం, పనుల ఒత్తిళ్లు, విశ్రాంతి లేకపోవడము, ఊహించని కంటి ప్రమాదాలు ఇవన్నీ కంటి చూపు కీలక కేంద్రమైన రెటీనాపై ప్రభావం చూపి సహజంగా వున్న కంటి చూపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కళ్ల వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే జీవితంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డా||ఆడమ్స్ సూచించారు. అతి కీలకమైన సున్నితమైన కళ్లను నిపుణులు ద్వారా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కంటిలో క్రొవ్వు పెరిగినా, వాపు, ఎర్రదనం వచ్చి కళ్లు మసకబారి కంటి చూపు కోల్పోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కంటి రెటీనాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సర్జన్ సలహాతో సమగ్ర కంటి వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు ఇండియాలో ఎక్కువశాతం కంటి సమస్యలతో బాధపడేవారున్నారు. దీనికి పలు రకాల కారణాలు మన కళ్లముందే కనబడుతున్నాయన్నారు.
చాపక్రింద నీరులా వస్తున్న మధుమేహం, బి.పి, శరీరానికి వచ్చిన అనారోగ్య సమస్యల ప్రభావం, ప్రధాన నాడీమండలమైన తల నుంచి కంటిచూపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కిడ్ని, గుండె వంటి ముఖ్య భాగాలు దెబ్బతింటే మనిషి ఆరోగ్యం కుదుటపడటం కష్టమన్నారు. ఆధునిక పరిజ్ఞానముతో రెటీనా వంటి కంటి సమస్యలను అధిగమించేందుకు అవసరమైన టెక్నాలజీ డా||అగర్వాల్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. రెటీనా సమస్య ఏర్పడిందన్న ఆలోచన వచ్చినపుడు ఎలాంటి అశ్రద్ధ, ఆలస్యం, నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే కంటి నిపుణులను సంప్రదించి సమస్య చిన్నగా వున్నప్పుడే పరిష్కారాలు చేసుకోవాలన్నారు. కంటి సమస్యలు, గ్రామీణ, నగర, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఉందన్నారు. అతి కీలకమైన రెటీనా చికిత్సను అతి సున్నితంగా వైద్యం నిర్వహించి పలువురికి కంటి చూపును కల్గించామన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్థులు వైద్యంలో నిర్లక్ష్యం వహించకుండా వైద్యుల సలహాలు, సూచనలు ఖచ్చితంగా పొంది, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలాన్నారు.
మేనరిక పెళ్లిళ్లతో ముప్పు
ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు పలు చోట్ల మేనరిక వివాహల వల్ల అనేక అనారోగ్య సమస్యలు పుట్టిన సంతానంలో సతమతమౌతున్న కుటుంబాలున్నాయన్నారు. జీవకణాల్లో సంభవించిన పలు మార్పులవల్ల ఎక్కువశాతం మేనరికం వివాహాల దంపతుల సంతానములో రేచీకటి, ఆలోచనలు మందగించడం, జీన్స్లో అనేక అనారోగ్య సమస్యలు సహజంగా వస్తాయన్నారు. వీలున్నంత వరకూ మేనరిక వివాహాలు శ్రేయస్కరం కాదన్నారు. అవగాహనతోనే మేనరికాలకు దూరంగా ఉండాలన్నారు. మనిషికి అంగవైకల్యం శాపంగా మారకూడదని ఆడమ్స్ సూచించారు. అభివృద్ధి చెందుతున్న సమాజంలో సమగ్ర ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిన వ్యక్తిగత బాధ్యత అందరికీ ఉందన్నారు.
గోల్డెన్ సమయం కాపాడుకోవాలి
ప్రతీ వ్యక్తికి దేవుడు ఓ గెల్డెన్ సమయం ఇస్తాడని , దాన్ని నిర్లక్ష్యంతో అధిగమిస్తే అతి ప్రమాదాలు వస్తాయన్నారు. తను మర్చిపోలేని సంఘటన గుర్తుచేశారు. ఒక రైల్వే ఉద్యోగి(టి.టి) ఆయన ఉద్యోగ రిత్యా రైలులో వస్తుండగా సోంపేట, పలాస స్టేషన్లు వచ్చేసమయానికి అనుకోని విధంగా చూపు మందగించింది. మార్గ మధ్యలో ఏమీ చేయలేక కొన్ని గంటల వ్యవధిలో ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో వైద్యులుగా మా ప్రయత్నం మేము చేసామన్నారు. ఈ విషయాన్ని రోగికి ముందుగా చెప్పామన్నారు. వచ్చిన రైల్వే ఉద్యోగికి చివరి గోల్డెన్ సమయం సద్వినియోగం కావడం, దేవుడిచ్చిన వరంలా పనిచేసి మళ్లీ ఎప్పటిలాగే కంటిచూపు రావడం అద్భుతమని అన్నారు. ప్రతీవారి జీవనంలో పలు ఊహించని సంఘటనలు జరుగుతాయన్నారు. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానమన్నారు. మన కళ్లను కాపాడుకోవడమే సమాజ ప్రగతికి నాంది అని డా||ఆడమ్స్ తెలిపారు.
డా||జేమ్స్ సుభ్రత్కుమార్ ఆడమ్స్


