కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి
- 16 Views
- admin
- July 4, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా అచల్ కుమార్ జ్యోతి నియమితులయ్యారు. గురువారం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర న్యాయశాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. నసీమ్ జైదీ స్థానంలో ఆయన సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రానికి సీఎస్‌గా ఉన్నారు ఏకే జ్యోతి. బుధవారంతో నసీమ్ జైదీ పదవీకాలం ముగియనుంది. 1975 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఏకే జ్యోతి.. 2015, మే 8న ఎలక్షన్ కమిషనర్‌గా ముగ్గురు సభ్యుల ఎలక్షన్ ప్యానెల్లో చేరారు. ఈసీ అయినా, సీఈసీ అయినా గరిష్ఠంగా ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. సీఈసీగా జనవరి 17, 2018 వరకు ఏకే జ్యోతి వ్యవహరిస్తారు. ఎన్నికల సంఘానికి 21వ సీఈసీ ఆయన. కెరీర్లో ఎక్కువ కాలం గుజరాత్‌లోనే పనిచేశారు. జైదీ రిటైరవుతుండటంతో త్వరలోనే కొత్త ఎన్నికల కమిషనర్‌ను ప్రభుత్వం నియమించనుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ కాకుండా ఓంప్రకాశ్ రావత్ పోల్ ప్యానెల్లో ఉన్నారు.
Categories

Recent Posts

