. కాపులకు అదిరిపోయే ఝలక్!!
- 12 Views
- admin
- July 5, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయవాడ, ఫీచర్స్ ఇండియా: ఇన్నాళ్లు కాపులు తమకోసం మంజునాథ కమిషన్ ఏదో వెలగబెడుతుందన్న భ్రమల్లోనే ఉన్నారు. జస్టిస్ మంజునాథ కమీషన్ తమకోసమే ఉంది. అది తమ బాగోగులు చూసుకుంటుంది అనే అనుకున్నారంతా. తమ వెనకబాటును సర్వే చేసి కేంద్రం ముందు క్లారిటీ ఇస్తుందనే అనుకున్నారంతా. అయితే అదంతా వట్టి అబద్ధం అని తేలిపోయింది. సాక్షాత్తూ జస్టిస్ మంజునాథన్ కమీషన్ అధ్యక్షుడే అదంతా ఉత్తుత్తి అని తేల్చేశారు. అంతేకాదు.. కాపులకోసమే మా కమీషన్ పని చేస్తుందన్న ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దని క్లారిటీనిచ్చారు. ఈ కమీషన్ ఏకంగా 62 కులాలకు సంబంధించిది. ఏ ఒక్క కులానికో చెందినది కానేకాదు.. అంటూ క్లారిటీనిచ్చారు.
62 కులాల్లో వెనకబాటుకు గురైన కులాలేవో ప్రభుత్వాలకు చెబుతాం. ఇదేదో కాపుల కోసం కమీషన్ అన్నట్టే ప్రచారం చేస్తున్నారు కొందరు అంటూ జస్టిస్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇన్నాళ్లు చంద్రబాబు కాపుల్ని ఏ రేంజులో మోసం చేశాడో బయటపడినట్టయ్యింది. ఇదిగో మీకోసమే మంజునాథ కమీషన్ అంటూ బాబు బొంకిన వైనం లో అసలు గుట్టు ఇప్పుడు బయటపడింది. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం.. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దురెటన తర్వత మీకోసమే కమీషన్ వేశాం అంటూ బాబు ఎంతగానో ప్రచారం చేశారు. అదంతా ప్రచారారాÄటేం మాత్రమేనని తేలిపోయింది. కాపుల కోసం ఏదో చేసేస్తున్నానని ప్రకటించుకునే బాబు అసలు గుట్టు లీకైంది. నేరుగా ఆ కమీషన్ నడిపించేవాళ్లే బాబు చేస్తున్న ప్రచారం నమ్మొద్దని డిక్లేర్ చేశారు. ఇక కాపుల కోసం ఏం చేస్తున్నామో చెప్పేది లేదని అన్నారాయన. అంతేకాదు.. అసలు ఏ కులం వెనకబడిందో మేం సీక్రెట్‌గా ప్రభుత్వాలకు చెప్పాలి కానీ, ఓపెన్‌గా చెప్పేది కాదు అంటూ చెప్పారు.


