పదేళ్ల బాలుడిపై అత్యాచారం.. హత్య
- 20 Views
- admin
- July 6, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం

విచారణలో విస్తు గొలిపే వాస్తవాలు..
చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బార్కాస్‌లో జరిగిన బాలుడి హత్య కేసులో విస్తు గొలిపే
విషయాలు బయటపడుతున్నాయి. బాలుడిని లైంగిక దాడిచేసి చంపేసిన నిందితుడు గతంలోనూ తాను 15 మంది బాలలపై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు వివరించాడు. గతంలో ఇద్దరు వ్యక్తులు తనపై అసహజ లైంగికదాడికి పాల్పడ్డారని.. అందుకు అలవాటుపడి తాను కూడా బాలురపై లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులకు తెలిపాడు. లైంగిక దాడి చేసిన అనంతరం విషయం బయటకు పొక్కకుండా వాళ్లకు రూ.10, 20లు ఇచ్చి వారి నోరు మూయించేవాడినని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ఘటనలో మాత్రం బాలుడు వినకపోవడంతో హత్య చేసినట్టు తెలిపాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని బాలుడిని వేడుకున్నా వినకపోవడంతోనే మొదట పొట్టపై తన్ని.. ఆ తర్వాత రాడ్‌తో తలపై బాది హత్యచేసినట్టు పోలీసులకు వివరించాడు. తన ఇంట్లో చెల్లలు వివాహం ఉందని, ఈ లైంగికదాడి విషయం బయటకు వస్తే పెళ్లి ఆగిపోతుందనే ఉద్దేశంతోనే ఆ బాలుడిని హత్యచేసినట్టు నిందితుడు చెప్పాడు. అసహజ లైంగిక ఘటనలకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు.


