స్వచ్చతకు ముందడుగు.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు
- 12 Views
- admin
- July 6, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: స్వచ్చ Ûసమ్మేళన్కి అందరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కోరారు. సిరిపురంలో గల వుడా బాలల థియేటర్లో గురువారం ఏర్పాటు చేసిన స్వచ్ఛసమ్మేళన్ కార్యక్రంలో ఆయన మాట్లాడారు. అర్బన్ గ్రామీణ ప్రాంతాలను బహిర్భూమి రహిత ప్రాంతాలుగా ప్రకటించామని స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ అధికారి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు . 2016 నుంచి చేస్తున్న కృషికి ఫలితంగా లక్ష్యసాధన చేరుకుంటామన్నారు.
విశాఖను బహిర్భూమి విధాన రహిత నగరంగా చేయడానికి స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చేయూత ఇవ్వడం అభినందనీయమన్నారు. విశాఖ ఏజెన్సీలో 1.50లక్షల జనాభా వున్న ప్రాంతంలో 2018 డిసెంబర్ కల్లా పూర్తిస్థాయిలో బహిర్భూమి విధానం రూపుమాపేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇప్పటికే అక్కడ 84వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని ఆయన గుర్తు చేశారు. ఇంకా 3.78లక్షల మరుగుదొడ్లు నిర్మించాల్సి వుందన్నారు. ఏజెన్సీలో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, స్మశానాల అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతాలలో 25వేల మరుగుదొడ్లను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తామని కలెక్టర్ వెల్లడించారు. మైదాన ప్రాంతంలో 65వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలన్నది లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. ఇప్పటివరకు 285 గ్రామాలను బహిర్భూమి విధానం లేని గ్రామాలుగా ఎంపిక చేశామన్నారు. యూనిసెఫ్ ప్రతినిధి మితల్రష్ద్యా మాట్లాడుతూ, పారిశుధ్యానికి ఆరోగ్యానికి ఎంతో సంబంధం వుందని ఆరుబయట మలవిసర్జన ద్వారా డయేరియా , అతిసార వ్యాధి వల్ల మూడు లక్షల మంది పిల్లలు చనిపోయిన విషయాన్ని అందరూ గమనించాలన్నారు.
చేతులు తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా కొన్నివేల బ్యాక్టీరియా నశిస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం ఉమ్మడిగా కలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 58శాతం మాత్రమే అభివృద్ధి సాధించారన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో బిల్లులు , మెజర్మెంట్ బుక్ విధానంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, సీఈఓ జయప్రకాష్‌నారాయణ,ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, తెలంగాణ అధికారి ఆరిల కట్టె వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి, డ్వామా పీడీ కళ్యాణచక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సీహెచ్.మహాలక్ష్మి, అధికసంఖ్యలో సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. అంతకుముందు అతిథులకు తులసిమొక్కలతో సాదర స్వాగతం పలకడం విశేషం.


