అందరూ న్యాయంగా ఆలోచస్తే సాధ్యమే-.జిల్లాప్రధాన న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి
- 14 Views
- admin
- July 8, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
-జీవితాలు వృధాకాకుండా సాయపడండి -అన్ని శాఖలు ముందుకు రావాలి
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: కేసులు పేరుకు పోవటానకి కాలయాపనే కారణమని, నిజాయతీగా మానవతా ధృక్పదంతో చేయూతనిస్తే పరిష్కారమవుతాయని జిల్లాప్రధాన న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి అన్నారు.
అందరూ నిజాయితీగా ముందుకు వస్తే ఎన్నో కేసులు పరిష్కరమవుతాయని . విశాఖపట్నం జిల్లాకోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబ్బుతో ముడిపడిఉన్న ఎన్ఐఏ చట్టంలో చెక్కులకు సంబంధించిన కేసుల పరిష్కారానికి ఎన్నో మార్గాలను సుప్రీంకోర్టు కొలిక్కితీసుకు వచ్చిందని, తద్వార కోర్టు ఖర్చుల భారం నుంచి విముక్తి లభించినట్లేనని తెలిపారు. గత తీర్పుల ద్వారా న్యాయసేవా సహకారసంస్థకు చెల్లింపులు అదే రోజు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రొ నోటు ద్వారా కొంత సమయం తీసుకుని చెల్లించే వెసలుబాటు ఉందన్న విషయాన్ని తెలిపారు. దీని ద్వారా సులభతర మార్గం ఏర్పడిందన్న విషయాన్ని గ్రహించి అందరూ పరిష్కారం కోసం ముందుకు రావాలని కోరారు. మున్సిపల్ టాక్స్‌లో పలు ఇబ్బందులు వున్న విషయాన్ని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ దృష్టికి తీసుకువెళ్ళగా సత్వర న్యాయానికి తీసుకునే చర్యలుపై అనుసరిస్తామని తెలిపారన్నారు. ఈపీఎస్ సమస్యలు వుడాలో అపరిష్కృతంగా వున్న విషయాలపై వుడా వీసీతో చర్చించి కాలాయాపాన లేకుండా సరైన లెక్కలో తీసుకువస్తే అదేవిధంగా న్యాయంగా చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు ఎక్కువగా రాజీ పడేటట్టు చేయగలిగామని, ఉదాహరణగా పెన్షలో జాప్యంతో అవస్థలు పడుతున్న వృద్ధురాలు 86ఎళ్ళ రాజేశ్వరికి సత్వర న్యాయం దిశగా సంబందిత శాఖ అధికారులతో మాట్లాడి 1.98 లక్షల చెక్కును అందజేశారు. జాయింట్ కలెక్టర్ సృజన మాట్లాడుతూ ప్రజా స్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కీలకమైనదని, అందరూ నిస్వార్ధంగా ముందుకు వస్తే న్యాయాన్ని పరిరక్షించడంలో అందరం భాగస్వాములమై చేదోడుగా ఉందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలిసు కమిషనర్ టి. యోగనంద్, ఎస్. దామోదర్‌రావు, ఎస్. నాగర్జున సాయిరమాదేవి, సత్యారావు తదితరులు పాల్గొన్నారు.


