వైభవంగా గిరి ప్రదక్షిణ
- 8 Views
- admin
- July 10, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
రికార్డు స్థాయిలో పాల్గొన్న భక్తులు నీలాద్రి గుమ్మం నుంచే దర్శనాలు
` ఆదివారం సాయంత్రం వరకు కొనసాగిన దర్శనాలు విరివిగా భక్తులకు సహాయాన్ని
` అందించిన స్వచ్ఛంద సంస్థలు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : సింహగిరి ప్రదక్షిణలో ఈ సారి అప్పన్న భక్తులు రికార్డు సృష్టించారు. మునుపెన్నడూ లేనివిధంగా భక్తులు దర్శనాలు చేసుకున్నారు. లక్షల మంది భక్తులకు అసౌకర్యం లేకుండా స్వామిదర్శనం లభించింది. అదే సమయంలో భక్తులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండాదారి పొడుగునా స్వచ్చంధ సంస్థలు సేవలను అందించాయి.
గిరి పౌర్ణమికి ముందు రోజులు సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు కాలినడకన సాగించే గిరి ప్రదక్షిణ ఈ ఏడాది భారీగా సాగింది. మధ్యాహ్నం రెండు గంటలకు స్వామి రథం తొలి పావంచా నుంచి మొదలైనా ఉదయం ఎనిమిది గంటలకే భక్తులు తమ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. మరుసటి రోజు వరకు భక్తుల రాక కొనసాగింది. ఈ దశలో శనివారం రాత్రి మాత్రం ఆదివారం మద్యాహ్నం వరకు మాత్రం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నాలుగు నుంచి 10 గంటల వరకు మాత్రం సింహగిరి భక్తులతో నిండిపోయింది. దీంతో వెను వెంటనే దర్శనాలు జరిగేలా దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. టికెట్లతో సంబంధం లేకుండా అన్ని క్యూ లైన్లలో భక్తులను అనుమతించారు. దీంతో దర్శనం ఆలయంలోకి ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే పూర్తి కావడంతో భక్తులు సంతృప్తితో రావడం కనిం పించింది. విఐపీల తాకిడి లేకపోవడంతో ఇదంతా సులభంగా జరిగిం దని పేరు చెప్పడానికి ఇష్టపడని దేవాదాయ ఉద్యోగి ఒకరు పేర్కొ న్నారు. భక్తులందరికీ నీలాద్రి గుమ్మం నుంచి దర్శనం కలిపించారు.
ఆలయం చుట్టూ 32 సార్లు ప్రదక్షిణ
సింహగిరిచుట్టూ 32 కిలోమీటర్ల దూరం ప్రదక్షిణ చేయలేని భక్తులు ఆలయం చుట్టూ 32 సార్లు ప్రదక్షిణ చేశారు. ఆ ప్రదక్షిణకు కూడా వేల సంఖ్యలో భక్తులు రావడం కనిపించింది. కొందరు 108 సార్లు కూడా ప్రదక్షిణ చేసి తమ భక్తిని చాటుకున్నారు,
ఇది సంస్కృతికి నిదర్శనం.. భరణికాన రామారావు
భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు లోటులేకుండా స్వచ్ఛంధ సంస్థలు సహకరించాయి. భక్తి భావాన్ని చాటుతూ భగవంతుని కీర్తనలను అలపించారు. అలాగేపులిహార, మజ్జిగ, టీ, పాలు, బిస్కెట్లు టిఫిన్ను అందించారు. హనుమంత వాక. మురళీ నగర్, బుచ్చి రాజపాలెం, శ్రీనివాసనగర్, ప్రహ్లాదపురం తదితర ప్రాంతా ల్లో సేవలు విరివిగా అందించడం జరిగింది.
మురళీనరగ్ ఈస్ట్ వద్ద విఎస్ క్రిష్ణా కాలేజీ పూర్వ విద్యార్ధుల సేవలు అమోఘంగా అందించారు. సాయంత్రం ఏడు గంటల నుంచి తెల్లవార్డు భక్తులను అన్ని రకాలుగా ఆహారం. మంచి నీరు, టీ అందిం చారు. పూర్వ విద్యార్థులు కేతా సత్యనారాయణ. జీ వెంకటేష్, బి. శ్రీనివాస రావు, డి. మోహన రావు, రాం మోహన్ రెడ్డి, భూపతి సత్యనారాయణ, డీవీఎస్ రాజు. ఎస్ఎన్ రాజు, శశికళ, కట్టా రమేష్ బాబు, మోహన రావు, జి.హేమ లత, శర్మ, వార్త శ్రీను తదితరులు సేవలు అందించిన వారిలో ఉన్నారు. మురళీనగర్ అయ్యప్ప నగర్ వద్ద ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాన్ని ఫీచర్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ భరణికాన రామారావు, ఆయన సతీమణి జయ ప్రారంభించారు. భారత దేశంలో పండగలు, ఆచారాలు సంస్క్రుతికి నాగరికతకు నిదర్శనాలుగా పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ ద్వారా భక్తితోపాటు విశాఖ నగర కీర్తి కూడా విస్తరించిందని అభిప్రా యపడ్డారు.
ఫీచర్స్ ఇండియా కార్యాలయం వద్ద …
గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు మురళీనగర్ లోని ఫీచర్స్ ఇండియా కార్యాలయం వద్ద కూడాసేవలు అందించారు. సంఘ సేవకులు చోడి శెట్టి శ్రీనివాసరావు సమకూర్చిన పులిహోరను భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఫీచర్స్ ఇండియా ప్రతినిధులు క్రిష్ణప్రసాద్, శంకర్, తిరుపతిరావు, కిల్లి ప్రకాష్, ఎన్. నాగేశ్వర్రావు. ఆర్. రామచంద్రరావు తదితరులు కూడా పాల్గొన్నారు.


