కొంపముంచిన స్టీల్‌ప్లాంట్ ప్రసాద్
- 12 Views
- admin
- July 11, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
– కోట్లలో అక్రమాస్తులు – నిరుద్యోగ బాధితుల ఆందోళన
– పోలీసులకు ఫిర్యాదు -కొనసాగుతున్న పోరాటం
విశాఖక్రైం, ఫీచర్స్ ఇండియా : అతను ప్రభుత్వరంగ సంస్థ ఉన్నతాధికారి. అవసరాలకు సరిపడా గౌరవ ప్రదమైన వేతనం. కుటుంబ పోషనకు చీకూచింతాలేదు. ఈ నేపథ్యంలో దిగువస్ధాయి అధికారి ఒకరు గొర్రెను కసాయివాడి దగ్గరకి తీసుకొచ్చిన చందంగా కొందరు నిరుద్యోగులను పరిచయం చేశారు. సదరు కుబేరుడులో స్వార్ధపు కోణం పడగవిప్పింది. కూలిపనులు చేసుకునే సదరు నిరుద్యోగులకు స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో ఎంతో అశపడిన ఆ నిరుద్యోగులు ముందువెనుకా ఆలోచించకుండా అప్పులు చేసి మరీ ఆ కుబేరుని చేతిలో సొమ్ములు ధారపోసారు. అతను చేసిన మోసం గ్రహించిన నిరుద్యోగులు సొమ్ములు వాపస్ చేయమని గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. ఆ అధికారి పదవీ విరమణ చేశారు. దీంతో స్టీల్‌ప్లాంట్‌లో పదవీ విరమణ ప్రయోజనాల సొమ్ములు చెల్లించరాదంటూ బాధితులు కోర్టులో కేసు వేయ్యడంతో ఆ చెల్లింపులు నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా కొద్ది రోజులుగా మోసం చేసిన అధికారి సొమ్ము వాపస్ చేయాలంటూ బాధితులు స్టీల్‌ప్లాంట్ గేటు వద్ద ధర్నాలు చేస్తున్నారు. ఇటీవల బాధితులు నగర సీపీ టి.యోగానంద్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో సీపీ విచారణకు ఆదేశించారు.
సీపీకిచ్చిన ఫిర్యాదులో వివరాలు ఇలావున్నాయి….
కూర్మాన్నపాలెం వడ్లపూడిలో సిరికి అప్పల నాయుడు ఎస్‌ఇజెడ్‌లో సెక్యూరిటీగా పని చేస్తున్నారు. అయితే ఖాళీ సమయంలో ప్లంబింగ్, కరెంట్, డోర్లు బిగించడం వంటి పనులకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో నగరంలో నోవాటెల్ ¬టల్ సమీపంలో గల దేవ్యా రెసిడెన్సీలో స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (పర్సనల్) గెడ్డం భవానీ శంకరప్రసాద్ తండ్రి (లేటు) సుబ్బారావు మా బంధువు కర్రి సన్యాసినాయుడు ప్లంబింగ్ పనులు ఒప్పుకున్నం దుకుగానూ ఈ బిల్డింగ్ పనులకు వెళ్లే క్రమంలో అక్కడ బిల్డింగ్ పనులు, ప్రసాద్ అన్ని వ్యవహారాలు స్టీల్‌ప్లాంట్ మేనేజర్ ఉచ్చల విజయభాస్కర్ చూస్తుంటారు.ఈ క్రమంలో ఎప్పుడు తొలగిస్తారో తెలియని సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలతో ఇబ్బందులు పడుతున్నామని విజయభాస్కర్‌కు తెలుపగా పసాద్తో మాట్లాడి కాంట్రాక్టు లేబర్‌గా ఉద్యోగం వేయిస్తామన్నారు. అప్పలనాయుడుతో పాటు మరో ఇద్దరికి కూడా వేయిస్తామన్నారు. మాముగ్గురిలో ఇద్దరికి పాఠశాలలో ఉద్యోగం కల్పించి తర్వాత స్టీల్‌ప్లాంట్ క్వార్టర్సు ఎలాట్ చేయిస్తామని తెలిపారు. అలా రూ. 8 లక్షలు ప్రసాద్ అడుగగా ఈ అభాగ్యులు రూ. 6 లక్షలు ఇస్తామని తెలిపారు. మొదట రూ.5 లక్షలు ఇచ్చిన తర్వాత మిగిలిన రూ. లక్షల ఆర్టరు ఇచ్చిననాడు ఇవ్వాలని తెలిపారు ప్రసాద్. అయితే తన ఇంటి లిఫ్ట్ కొరకు రెండుసార్లు డీడీల రూపంలో ఇవ్వాలని మిగతాది నగదు రూపంలో చెల్లించాలని తెలిపారు. కాగా మే 21, 2015లో ఎస్బీఐ అకౌంట్ కకూర్మన్నపాలెం బ్రాంచ్‌లో ద్వారా రూ.2 లక్షల 83 వేల 630 డీడీని లిఫ్ట్ కంపెనీ పున ఇచ్చారు. అలాగే 29 సెప్టెంబర్ 2015 మరో డీడీ ఇచ్చారు. మిగిలిన రూ. 52 వేలు కూర్మన్నపాలెం బ్యాంక్ బయట అందించారు. విజయ భాస్కర్ ముగ్గురి బయోడాటాలు తీసుకుని ప్రసాద్‌కి ఇచ్చానని వీలు చూసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తారని తెలిపారు. ఈ నేపద్యంలో ప్రాసాద్ను పలుమార్లు కలిసి ఉద్యోగాల కోసం అడుగగా చేస్తాను కంగారు పడొద్దని బదులిచ్చారు. ఇదే మాట విజయభాస్కర్‌ను అడుగగా ప్రసాద్ అప్పుల్లో వున్నారని ఏదో స్ధలం అమ్మి తర్వాత ఇస్తారని ప్రతిసారి సర్ది చెప్తూ వచ్చారు. ఈ నెపంలో పనిలోపనిగా విజయభాస్కర్ తన అక్రమ సంపాదనలతో కూర్మన్నపాలెం అన్నపూర్ణా ధియేటర్ సమీపంలో అపార్టుమెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీంతో ఐక్లిక్లో ఫిర్యాదు చేశారు. అంతేకాక పెద్ద పదవి చేసిన ప్రసాద్‌కు పలువురు రాజకీయ నాయకులు పరిచయమని బెదిరించి నట్టు బాధితులు వాపోయారు.
ప్రసాద్ అక్రమాస్తులివే..
– బీచ్‌రోడ్డులో నోవాటెల్ వద్ద గల దేవ్యా రెసిడెన్సీలో 4వ ఫ్లోరులో సుమారు 450 చ.గ. ఇల్లు
-ఎలమంచలి హైవేపై 0.84 సెంట్ల ల్యాండ్
-తగరపువలస సమీపంలో గల చిప్పాడలో 0.49 సెంట్లు స్ధలం
-ఎస్‌కోట ప్రధాన రహదారిలో 1200 చ.గ. స్ధలం
-సన్‌రైజ్ ప్రజెక్టులో 720 చ.గ.
-అలాగే ప్రసాద్ కుమారుడు సిద్దార్ధ్ పేరుతో భీమునిపట్నం సమీపంలో లక్షల విలువ చేసే భూములు కొనుగోలు చేశారు.
ౖ కుమార్తె సమత, అల్లుడు ప్రవీణ్ పేరున మ్గమారిపేటలో లక్షల విలువచేసిన భూమిని 2015లో కొనుగోలు చేశారు. అయితే అమెరికాలో వుంటున్న తన కుమార్తె సమత పేరున వున్న ఈ భూమిని తన పేరున పవర్ ఆఫ్ అటార్నీ కోసం రిజిస్ట్రార్‌కు ధరఖాస్తు చేయగా ఇవి ప్రభుత్వ భూములు కావడంతో పవర్ ఆఫ్ అటార్నీ చెయ్యడం వీలు కాదని తిప్పి పంపినట్లు సమాచారం.
– ఇలా భీమునిపట్నం, రుషికొండ, విశాఖడైరీ సమీపంలో గల అకికరెడ్డిపాలెం వద్ద గల నాతయ్యపాలెం, దేశపాత్రునిపాలెం, హైదరాద్ గండిపేట ఇలా ఆక్రమాస్తులు కూడబెట్టారు.
సొమ్ముల కోసం బాధితుల పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే
– స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేటు వద్ద ధర్నాలు
– కోర్టులో కేసులు
– సీపీ కి ఫిర్యాదు
బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచిచూడాల్సిందే


