గో రక్షణ దాడులు
అల్లరి మూకలు ఏమి చేసినా చెల్లుతుందనే భావన ప్రచారం కావడం ప్రమాదకరం. మూక హింసను ఎట్టి పరిస్థితులలోనూ అనుమతిం చకూడదు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ప్రజాస్వామ్యం నిలదొక్కుకున్నదీ అంటే అందుకు కారణం చట్టబద్ధ పాలన సాగడమే. ఒకసారి చట్టబద్ధ పాలన గాడి తప్పితే ప్రజాస్వామ్యం కూలిపోయి మూకస్వామ్యం నెలకొంటుంది. బలవంతులు ఏ సాకులైనా చూపించి బలహీనులపై దాడులు సాగించవచ్చు. బలవంతుల నుంచి సామాన్యులను కాపాడటమనేది ప్రజాస్వామ్య లక్షణం.
గోవులను సంరక్షించడం ప్రధానమే అయినప్పటికీ, ఇందుకోసం చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని ప్రధాని మోదీ స్పష్టం చేయడం వల్ల దేశవ్యాప్తంగా దాడులు ఆగిపోతాయనే ఆశాభావం కలుగుతున్నది. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం శతవార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రధాని ప్రసంగిస్తూ గోరక్షణ పేర సాగుతున్న దాడులను ఖండించారు. మహాత్మాగాంధీ గోరక్షణ జరుపాలని కోరుకున్నారనేది గుర్తుచేస్తూ, గో రక్షణ పేర మనుషులను హతమార్చడాన్ని మాత్రం ఆయన ఆమోదించేవారు కాదని ప్రధాని వివరించారు. మనది మహాత్మా గాంధీ జన్మించిన భూమి.. అహింసా భూమి… మన సమాజంలో హింసకు స్థానం లేదు. హింస సమస్యలను పరిష్కరించదు.. అని ప్రధాని ఉదోÄదిేంచారు. అయితే ప్రధాని మాటలు కాదు చేతల్లో చూపాలనే భావన ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నది. ప్రధాని దాడులను ఖం డించడం మరీ ఆలస్యంగా జరిగిందని, మెతకగా ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మూక దాడుల పట్ల ప్రజావ్యతిరేకత రావడంతో ప్రధాని మాట మాత్రంగా ఖండించారని, ఇదొక ప్రచార హంగామా అని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడ్డది. మాటలు కాదు, ఆచరణలో చూపాలె అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. ప్రధాని గతంలోనూ గోరక్షణ పేర సాగుతు న్న దాడులను ఖండించారు. కొందరు రాత్రివేళ సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడి, తెల్లారి గోరక్షకుల అవతారం ఎత్తుతున్నారని గత ఏడాది ఆగస్టు నెలలో అన్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా గోరక్షణ పేర దాడులు సాగుతూనే ఉండటం విచారకరం.
పాలకులు తమ సైద్ధాంతిక భావజాలాన్ని ప్రచారం చేయాలనుకోవడం సహజం. కానీ తమ సామాజిక ద క్పథం, సైద్ధాంతిక భావనలు వక్రీకరణలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవా లె. తమ అనుచరులకు లేదా భిన్న ప్రజా సమూహాలకు తప్పుడు సందేశాలు అందకుండా వ్యవహరించాలె. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశవ్యాప్తంగా గోరక్షణ పేర దాడులు సాగుతున్నాయి. సబర్మతి ఉత్సవాలలో ప్రధాని గోరక్షణ పేర దాడులను హెచ్చరించిన రోజు జార?ండ్‌లో మరో దాడి జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన 32 దాడుల్లో 23 మంది మరణించారు. దౌర్జన్యకారులు తాము చేసే దాడులకు గోరక్షణ ముసుగును కప్పుతున్నారనేది కూడా తెలిసిందే. ఈ దాడులు ఎక్కువగా బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలోనే జరుగడం గమనార్హం. ఇప్పుడు యాంత్రీకరణ పెరిగింది కానీ, వ్యవసాయ సమాజంలో పశువులకు ఉన్న ప్రాధా న్యం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ క్రమంలో గోవులను పూజించడమనేది సంప్రదాయంగా బలపడ్డది. గోవులను కాపాడాలనుకోవడంలో తప్పులేదు. నిజాం పరిపాలనా కాలంలో హైదరాబాద్‌లో గో శాలలు నెలకొల్పా రు. కానీ గోవులను కాపాడటం కోసమంటూ మనుషులను హతమార్చడమనే దారుణ పోకడ ఇటీవల మొదలైంది. గోరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా మత అల్పసంఖ్యాకవర్గాలు, దళితులు, గిరిజనులపై దాడులు సాగుతున్నాయి. తాము సాగించే దాడుల కు పాలకపక్షం నుంచి అండదండలు ఉంటాయనే తప్పుడు సంకేతాలు వ్యాపించడం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తింది. ఈ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు కూడా ఇటీవల పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ గోరక్షణ పేర దాడులను ఖండించవలసి వచ్చింది.
అల్లరి మూకలు ఏమి చేసినా చెల్లుతుందనే భావన ప్రచారం కావడం ప్రమాదకరం. మూక హింసను ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించకూడదు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తు న్నా ప్రజాస్వామ్యం నిలదొక్కుకున్నదీ అంటే అందుకు కారణం చట్టబద్ధ పాలన సాగడమే. ఒకసారి చట్టబద్ధ పాలన గాడి తప్పితే ప్రజాస్వామ్యం కూలిపోయి మూకస్వామ్యం నెలకొంటుంది. బలవంతులు ఏ సాకులైనా చూపించి బలహీనులపై దాడులు సాగించవచ్చు. బలవంతుల నుంచి సామాన్యులను కాపాడటమనేది ప్రజాస్వామ్య లక్షణం. చట్టం, న్యాయంతో నిమి త్తం లేకుండా తమకు తామే నేరారోపణలు చేసి, తీర్పు ఇచ్చి అమలు చేయడం ఏ కారణంగా నూ సమర్థనీయం కాదు. ఒక బలహీనవర్గానికి చెందిన వ్యక్తిపై ఏదో ఒక ఆరోపణ చేసి హతమారుస్తామనడం ఆధునిక యుగంలోనూ జరుగడం సిగ్గుచేటు. భారతదేశం విశాలమైనది, వైవిధ్యభరితమైనది కావడం వల్ల ఎన్నో రకాల ఆహార అలవాట్లు, వస్త్రధారణ, సంస్కతీ సంప్రదాయాలు ఉంటాయి. ఒకరి జీవన సరళిని మరొకరు గౌరవించుకోవాలే తప్ప ఈసడించుకోకూడదు. తమ జీవన విధానాలు, సామాజిక విలువలే సరైనవని, వాటిని ఇతరులపై రుద్దాలని భావించే ఆధిపత్య సంస్క తిని పాలకులు పెంచి పోషించకూడదు. దానివల్ల దేశ వ్యాప్తంగా సమాజంలో అడ్డంగా, నిలువునా విభజన రేఖలు ఏర్పడి సామాజిక సంక్షోభాలు ఏర్పడుతయి. ప్రధాని మోదీ మాట మాత్రంగా ఈ దాడులను ఖండించినంత మాత్రాన సరిపోదు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా దేశవ్యాప్తంగా దౌర్జన్యాలకు దిగిన మూకలను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలె. దేశంలో చట్టబద్ధపాలన సాగుతున్నదని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా శిక్షార్హులని తన కార్యాచరణ ద్వారా సంకేతాలను పంపించాలి.


