డ్రాగన్ నిప్పులు
2002 మార్చ్‌లో చైనా అధ్యక్షుడు, 2013 మేలో చైనా ప్రధాని భారత్ పర్యటన సందఠంగా టిబెటన్ల ఆత్మబలి దానాలు, ఆందోళనలు జరిగినప్పటి నుంచి భారత్‌పై చైనా గుర్రుగా ఉన్నది. అంతకన్నా ముఖ్యంగా భారత్ పూర్తిగా అమెరికా శిబిరంలో చేరిపోయిట్లుగా వ్యవహరించటం కూడా చైనాకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోంచే చైనా భారత్‌పట్ల పూర్తిగా శత్రువైఖరి ప్రదర్శిస్తూ అయినదానికి, కానిదానికి కయ్యానికి దిగుతున్నది. అయినప్పటికీ ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో భారత్ సామరస్యపూర్వకంగానే చైనాతో వివాదాలను పరిష్క రించుకోవాలని భావిస్తున్నది. చైనా కూడా ఇందుకు అనుగుణంగా స్పందించాలె.
కొంతకాలంగా భారత్‌పై కారాలు మిరియాలు నూరుతున్న చైనా మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో నిప్పులు గక్కింది. నాథు లా పాస్ మార్గాన్ని మూసివేసి ఏకంగా మానస సరోవర్ యాత్రికులను అడ్డుకొని భారత్‌పై అక్కసును వెళ్ళగక్కింది. సిక్కిం సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాన్ని భారత్ అడ్డుకుంటున్నందుకే తాము నాథులా పాస్ మార్గం గుండా సాగే యాత్రికులను అడ్డుకోవాల్సి వచ్చిందని సాకులు చెబుతున్నది. గతంలో ఇరుదేశాలు చేసుకున్న ఒప్పందం కారణంగా ఆ మార్గాన్ని తెరిచినా తాజా పరిణామాల నేపథ్యంలో నాథు లా పాస్ మార్గాన్ని మూసివేయక తప్పలేదని చెప్పుకుంటున్నది. ప్రధానంగా దలైలామాను అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ అతిథిగా పర్యటించటానికి అనుమతించినప్పటి నుంచి చైనా భారత్‌పై కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నది. దీనికితోడు అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ-ట్రంప్ మధ్య చైనా, పసిఫిక్ మహాసముద్ర భద్రత అంశాలు చర్చలోకి రావడంతో ఆగ్రహంగా ఉన్నది. అలాగే టెర్రరిస్టు కార్యకలాపాల పట్ల పాకిస్థాన్‌ను హెచ్చరించటాన్ని కూడా చైనా జీరి?ంచుకోలేకపోతున్నది. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నా అతిపెద్ద జనాభాతో శరవేగంగా అభివ ద్ధి చెందుతున్న భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం మంచిది కాదు. ఆధిపత్య పోరు ఇరు దేశాలకూ నష్టదాయకమైనదని గుర్తించకపోవటం విషాదం. సమస్యలు ఏమున్నా ప్రజల విశ్వాసాలు గాయపర్చే రీతిలో మానస సరోవర్ యాత్రికులు ప్రయాణిస్తున్న నాథు లా పాస్ మార్గాన్ని చైనా మూసి వేయటం గర్హనీయం.
నిజానికి మానస సరోవర్ యాత్ర మొదటి నుంచీ లిపులేఖ్ ప్రాంతం మీదుగా జరిగేది. అయి తే 2003లో వచ్చిన ఉత్తరాఖండ్ వరదల తర్వాత ఆ మార్గం పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పుడు కూడా ఆ ప్రాంతం గుండా యాత్ర సాగుతున్నా ఎత్తయిన పర్వతాలు దాటుకుంటూ వెళ్లడం ఎంతో ప్రయాస. రెండేళ్ల కిందట చైనా అధ్యక్షుడు శిఖరాగ్ర చర్చల కోసం భారత్ వచ్చినప్పుడు కైలా స్ మానస సరోవర్ వెళ్లేందుకు నాథులా మార్గాన్ని తెరువడానికి అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే 2006లో వాణిజ్య కార్యకలాపాల కోసం మొదటిసారి తెరిచారు. లిపులేఖ్‌తో పోలిస్తే ఇది చాలా సురక్షితమైనది. నాథు లా నుంచి కైలాస్ వరకూ ఉన్న సుమారు రెండువేల కిలోమీటర్ల దూరాన్ని మూడు రోజుల్లోనే చేరుకోవచ్చు. చైనా కల్పించిన సౌకర్యా లు, సేద తీరటానికి అనువైన పరిస్థితుల కారణంగా ఎక్కువమంది యాత్రికులు ఈ మార్గం నుంచి వెళ్లటానికే ఇష్టపడుతారు. చైనా ఇలాంటి పరిస్థితులను ఆసరాగా చేసుకొని భారత్‌ను దారికి తెచ్చుకోవాలనుకోవటం సమర్థనీయం కాదు.
భారత్, చైనా మధ్య సరిహద్దుకు ఆధారమైన మెక్‌మోహన్ విషయంలో మొదటినుంచీ అసంత ప్తిగా ఉన్న చైనా సందఠం వచ్చినప్పుడల్లా దాన్ని ముందుకు తేవ టం పరిపాటి అయింది. ఇప్పుడు సిక్కిం సరిహద్దు సమీపంలో నిర్మిస్తున్న రోడ్డుపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయటంతో చైనాకు అహం దెబ్బతిన్నది. దీంతో సిక్కిం భూభాగమే చారిత్రకంగా తమదని, దాని పేరు చరిత్రలో ఝె అని వాదిస్తూ సరిహద్దు సమస్యను మరింత జటిలం చేస్తున్నది. మొత్తంగా భారత్-చైనా మధ్య జమ్ము కశ్మీర్‌నుంచి అరుణాచల్‌ప్రదేశ్ దాకా ఉన్న 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ప్రాంతాన్ని ఉద్రిక్తంగా మారుస్తున్నది. ముఖ్యంగా సిక్కిం రాష్ట్రంలో ఉన్న 220 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతమంతా చైనా చర్యల వల్ల యుద్ధభూమిని తలపిస్తున్నది. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చి బంకర్లను ధ్వంసం చేశారు. భారత సైనికులే తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చారని నిందలు మోపుతూ తన దుందుడుకు చర్యలను సమర్థించుకోజూస్తున్నది.
అమెరికా, భారత్ చెలిమి పట్ల చైనా మొదటినుంచీ అనుమానంగా చూస్తున్నది. ఈ కారణంగా భారత్ పట్ల తీవ్ర అసహనంతో వ్యవహరిస్తున్నది. దలైలామా అరుణాచల్‌ప్రదేశ్ పర్యటన సందఠంగా కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేసింది. అంతే గాకుండా చైనా సరిహద్దు కు రెండు వందల మైళ్ల దూరంలోనే ధర్మశాలలో ఆశ్రయం పొందడం కంటగింపుగా ఉన్నది. అలాగే 2002 మార్చ్‌లో చైనా అధ్యక్షుడు, 2013 మేలో చైనా ప్రధాని భారత్ పర్యటన సందఠంగా టిబెటన్ల ఆత్మబలి దానాలు, ఆందోళనలు జరిగినప్పటి నుంచి భారత్‌పై చైనా గుర్రుగా ఉన్నది. అంతకన్నా ముఖ్యంగా భారత్ పూర్తిగా అమెరికా శిబిరంలో చేరిపోయిట్లుగా వ్యవహరించటం కూడా చైనాకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోంచే చైనా భారత్‌పట్ల పూర్తిగా శత్రువైఖరి ప్రదర్శిస్తూ అయినదానికి, కానిదానికి కయ్యానికి దిగుతున్నది. అయినప్పటికీ ప్రస్తు త జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో భారత్ సామరస్యపూర్వకంగానే చైనాతో వివాదాలను పరిష్క రించుకోవాలని భావిస్తున్నది. చైనా కూడా ఇందుకు అనుగుణంగా స్పందించాలె. ఆసియాలో ప్రాధాన్యం కలిగిన దేశాలుగా ఇరుదేశాలూ సంయమనం పాటించాలి. కలిసికట్టుగా వ ద్ధి చెందవలసిన తరుణంలో కలహాలతో కాలం గడుపడం ఏ దేశానికీ మంచిది కాదు.


