బహిరంగ చర్చకు సిద్ధం
- 12 Views
- admin
- July 11, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
-విశాఖ భూ కుంభకోణం సీబీఐ దర్యాప్తు చేయాలి
-అక్టోబర్ 27 నుంచి జగన్ పాదయాత్ర
-వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : విశాఖపట్నం భూ కుంభకోణంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019నాటికి వైఎస్ఆర్సీపి అధికారంలోకి వస్తుందని, జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌లపై కేసులు బనాయించి జైలుకు పంపడం ఖాయమన్నారు. విశాఖలో భూముల కుంభకోణంలో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ అన్యాయాలపై ప్రధాని మోడీ దృష్టికి, వైకాపా తరపున తీసుకెళ్తున్నామని అన్నారు. పేదలకు అండగా తమ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. సంపూర్ణ మద్య నిషేదం, బాక్జైట్ తవ్వకాలు నిషేదించాలని, ఉత్తరాంధ్ర సుజల ధార అంశాలతో పాటు 18 అంశాలపై అమరావతిలో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాల్లో తీర్మాణాలు చేశామన్నారు. గ్రామ, జిల్లా స్థాయిలో ప్రజల సంక్షేమకోసం పోరాడుతామని, రాజీలేని పోరాటానికి వైకాపా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 27న ప్రారంభం కానున్న అన్న వస్తున్నాడు కార్యక్రమం ద్వారా పార్టీ అధినేత జగన్ రాష్ట్రంలో సుమారు నాలుగు నెలలు, మూడువేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర సాగుతుందన్నారు. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతూ రానున్న రోజుల్లో సుస్థిర పాలనకు వైఎస్ఆర్సిపి ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.


