మత్తులో బాల్యం
యువతలోని ఉద్రేకాలే పెట్టుబడిగా పెడ ధోరణులెన్నో ఇవ్వాళ రాజ్యమేలుతున్నాయి. అందులో ఆధునిక టెక్నాలజీ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ లాంటివి యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. సాంస్కతిక పతనానికి ప్రధాన హేతువుగా మారుతున్నాయి. ఏడెనిమిది తరగతులు చదివే విద్యార్థి నుంచి ఇవ్వాళ స్మార్ట్ ఫోన్లు జేబులో పెట్టుకొని కాలం వెళ్లబుచ్చుతున్నారు.
చదువులతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థులు లేలేత వయస్సులోనే మత్తుకు చిత్తవుతున్న తీరు సమాజాన్ని భయకంపితుల్ని చేస్తున్నది. ఎక్కడో విదేశాల్లోనో, మెట్రోపాలిటన్ నగరాల్లోనో ఉంటుందనుకున్న ప్రమాదకర మాదక ద్రవ్యాలు నగర విద్యార్థులను బలి తీసుకుంటున్న వైనం అందరినీ కలవరపరుస్తున్నది. ఏళ్లుగా నగరంలో మాదక ద్రవ్యాల ముఠా లు చాపకింది నీరులా విస్తరిస్తున్నాయన్న అనుమానాలున్నాయి. మాదక ద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని తాజా ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. కెల్విన్ మాస్కెరాన్స్ ముఠా చేతిలో దాదాపు వెయ్యిమంది పాఠశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారినతీరు చూసి నగరవాసులు వణికిపోతున్నారు. మాస్కెరాన్స్ మాదక ద్రవ్యాల రాకెట్ గుట్టుచప్పుడు కాకుండా అమెరికా నుంచి కొరియర్లో ఎల్ఎస్డీ, ఎండీఎంఏ లాంటి ఖరీదైన మత్తు పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నది. ఉన్నతవర్గాలు, వారి పిల్లలే లక్ష్యంగా చేసుకొని ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు చేరవేస్తూ విద్యార్థులను మత్తుకు బానిసలను చేస్తున్నది.
పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో చిన్నచిన్న దుకాణాలు, డబ్బాకొట్ల లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నది. ఈ మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కి దాన్ని పొందటం కోసం విద్యార్థులు పడుతున్న తంటాలు చూస్తే ఒళ్లు జలదరిస్తున్నది. ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి మత్తు మందుకు బానిస అవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. గత ఇరువై రోజుల్లోనే 136 మందికి మాదక ద్రవ్యాలను విక్రయించారంటే నగర విద్యార్థి యువత ఏ స్థాయిలో మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుంటున్నారో చూస్తే భయమేస్తున్నది.
ఈ మధ్యనే చేసిన ఒక అధ్యయనం ప్రకారం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా మాదక ద్రవ్యాలు వినియోగంలో ఉన్నాయి. మాదక ద్రవ్యాల బారిన పడిన రాష్ట్రాలు పన్నెండింటిలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక పంజాబ్ రాష్ట్రమైతే మత్తుమందుకు బానిసైన ప్రాంతంగా దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రతిరోజూ పంజాబ్‌లో పదిమంది మదకద్రవ్యాలకు బానిసలై చనిపోతున్నారు. జాతీయ నేర గణాంకశాఖ లెక్కల ప్రకారం దేశంలో నానాటికీ మాదక ద్రవ్యాల పీడితుల సంఖ్య పెరిగిపోతున్నది. ఒక స్వఛంద సంస్థ అధ్యయనం ప్రకారం మాదక ద్రవ్యాల బానిసలు గా చికిత్సకు వస్తున్న 63 శాతం రోగుల్లో 15 ఏళ్లలోపు పిల్లలు కూడా ఉంటున్నారని తెలిపింది. ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక ద ష్టిసారించి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఐక్య రాజ్యసమితి కూడా మాదకద్రవ్యాల ప్రమాదాన్ని అన్ని దేశాలూ తీవ్ర సమస్యగా తీసుకోవాలని సూచించింది. ఆధునిక సమాజంలో మానవాళిని పీడిస్తున్న వాటిలో ఉగ్రవాదం తర్వాత మాదక ద్రవ్యాల ప్రమాదమే అతిపెద్దదని తెలిపింది. మారిజౌనా, కొకైన్, బ్రౌన్ షుగర్, గంజాయి, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ లాంటి మత్తు పదార్థాలు ప్రజలను ముఖ్యంగా యువతను బలితీసుకుంటున్నదని హెచ్చరించింది. ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
యువతలోని ఉద్రేకాలే పెట్టుబడిగా పెడ ధోరణులెన్నో ఇవ్వాళ రాజ్యమేలుతున్నాయి. అం దులో ఆధునిక టెక్నాలజీ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ లాంటివి యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. సాంస్కతిక పతనానికి ప్రధాన హేతువుగా మారుతున్నాయి. ఏడెనిమిది తరగతులు చదివే విద్యార్థి నుంచి ఇవ్వాళ స్మార్ట్ ఫోన్లు జేబులో పెట్టుకొని కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ క్రమంలో వారు స్మార్ట్ ఫోన్లో చూస్తున్నదంతా పోర్న్ మాత్రమేనని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక ఏడో తరగతి అబ్బాయి తన తల్లిదండ్రుల ఏకాంత దశ్యాలను వీడియో తీసి తన మిత్రులతో షేర్ చేసుకున్నాడంటే ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది బాల్యంలోనే మానసిక రోగులుగా మారుతున్న తీరు కనిపిస్తున్నది. వీటన్నింటికీ సామాజిక పరిస్థితులకు తోడు కుటుంబ జీవనం కూడా కారణమవుతున్నది. పిల్లలకు ఐదారేళ్లు వచ్చాయనగానే ప్రత్యేక గదులు కేటాయించే నాగరిక సంస్క తి ఒకటి ఉన్నది. దీంతో ఆ విద్యార్థులు ఒంటరిగా రాత్రంగా ఏం చేస్తున్నారో చూసే తీరిక, ఓపిక నేటి తల్లిదండ్రులకు ఉండటం లేదు. ఈ నేపథ్యంలోంచే విద్యార్థి దశలోనే విపరీత అలవాట్లకు, వ్యసనాలకు బానిసలవుతున్న తీరు కనిపిస్తున్నది. నగరంలో మత్తుకు అలవాటైన బాలలు వైట్నర్ను, దగ్గుకు ఇచ్చే సిరప్‌ను కూడా తాగి మత్తులో జోగుతు న్న తీరు గతంలోనే వెలుగులోకి వచ్చింది. మొదట సిగరెట్ నికోటిన్‌కు బానిసై, ఆ తర్వాత.. క్రమంగా గంజాయి, హుక్కా కు అలవాటవుతన్నారు. సంపన్న వర్గాల పిల్లలు అర్ధరాత్రుల దాకా హుక్కాపీలుస్తూ పబ్బుల్లో కాలం గడుపుతున్న ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలోంచే రాష్ట్ర ప్రభుత్వం పబ్బులు, క్లబ్బులపై ఉక్కుపాదం మోపి అసాంఘికశక్తుల ఆట కట్టిస్తున్నది. తాజా కెల్విన్ మాస్కెరాన్స్ డ్రగ్ రాకెట్లో కూడా కీలక నిందితులందరినీ అరెస్టుచేసి ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు హర్షణీయం. మరోవైపు విద్యార్థుల దైనందిన జీవితాచరణపై కుటుంబ పెద్దల పర్యవేక్షణ ఎల్లవేళలా ఉండాల్సిన అవసరాన్ని తాజా ఘటనలు రుజువుచేస్తున్నాయి. యువత మాదకద్రవ్యాల బారినపడకుండా అటు కుటుంబం, ఇటు ప్రభుత్వం కలిసికట్టుగా కషి చేయాలి. యువత భవిష్యత్తును తీర్చిదిద్దటంలో సమాజం, కుటుంబ పాత్రే ప్రధానమన్నది మరువరాదు.