మత రాజకీయం
గూర్ఖాలాండ్ ఉద్యమం, మత కలహాలు తమ పార్టీని దింపడానికి జరుగుతున్న కుట్ర అనే అనుమానం మమతా బెనర్జీకి ఉన్నది. దీనిని తొలిగించి భరోసా ఇవ్వడం బీజేపీ నేతల బాధ్యత. ఈ భరోసా ఎంత స్పష్టంగా ఉండాలంటే, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిమ్మళం పొందాలె. భవిష్యత్తులో ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ కేంద్రం నుంచి ముప్పు ఉన్నదనే భయం కలుగకూడదు. రాష్ట్రాల్లోని ప్రజా ప్రభుత్వాలనుకూల్చివేయడం సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధం. ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటాయి.
పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో చెలరేగిన మత కలహాలు దేశంలోని సామాజిక ఉద్రిక్తతలనే కాదు, రాజకీయ పతనాన్ని కూడా సూచిస్తున్నాయి. ఒక పదకొండవ తరగతి విద్యార్థి ఫేస్బుక్లో మరో మతానికి సంబంధించిన అభ్యంతరకర బొమ్మలను పెట్టడంతో ఈ నెల నాలుగవ తేదీన మత కలహాలు ప్రారంభమయ్యాయి. పరస్పర దాడులతో పాటు భారీ విధ్వంసం సాగింది. మత హింసాకాండ సద్దుమణు గుతున్నదని భావిస్తున్న దశలో కత్తిపోటుకు గురైన ఒకరు ఆస్పత్రిలో మరణించారు. దీంతో కలహాలు మళ్ళా రగిలాయి. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఈ మత కలహాల సందఠంగా గమనించవలసిన విషయం సోషల్ మీడియా పాత్ర. మతకలహాలు చెలరేగడానికి కార ణం సోషల్‌మీడియానే. ఈ విద్వేషాలు మరింతగా వ్యాపించడానికి కూడా సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని అన్నిజిల్లాల్లో సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం భారీగా సాగుతున్నది. దీంతో ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగాన్ని నిలిపివేయవలసి వచ్చింది. ఈ కారణంగా సోషల్ మీడియాపై నిఘా పెంచాలని కానీ, ఆంక్షలు విధించాలని కాదు. ఒక విద్యార్థి ఒక అభ్యంతరకర దశ్యాలను పెట్టిన వెంటనే, ఒక మతం వారు గొడువలు చేయడం, మరో మతం వారు అదే స్థాయిలో తిప్పికొట్టడం వెనుక కుట్ర ఉన్నదనేది స్పష్టం. ఇదే రీతిలో సంఘ విద్రోహశక్తులు ఇతర సాధనాల మాదిరిగానే సోష ల్ మీడియాను కూడా పెద్ద ఎత్తున వాడుకుంటున్నాయనేది గమనించవలసిన విషయం. ఈ సంఘ విద్రోహులను ఎట్లా అరికట్టాలనేది ఆలోచించవలసిన విషయం.
ఒకే సమాజంలో సోదరభావంతో బతుకవలసిన భిన్న మతస్థులు కత్తులు దూసుకోవడమే విషాదకరం. అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపై నిలిచి మత కలహాలను ఆర్పివేయ యత్నించవలసింది. కానీ స్థానిక రాజకీయ నాయకులు కొం దరు స్వయంగా కలహాగ్నిని రగిలిస్తున్నారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి నేతలు బురదజల్లుకోవడంలో తలమునకలైపోతున్నారు. ఇప్పటికే దాడు లు విధ్వంసాలతో తల్లడిల్లుతున్న ప్రాంతానికి వెళ్ళడానికి కాంగ్రెస్, సీపీఎం నాయకులు ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నది. రూపా గంగూలీ నేత త్వంలోని బీజీపీ బ ందాన్ని కూడా ప్రభుత్వం వెళ్లనీయలేదు. మమతా బెనర్జీ మైనారిటీల మెప్పు కోసం మత రాజకీయాలను నడుపుతున్నారనేది బీజేపీ నాయకుల ఆరోపణ. బీజేపీయే మత రాజకీయాలను ఉసిగొలిపి రాష్ట్రంలో బలపడాలని యత్నిస్తున్నదనేది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణ. మమతా బెనర్జీని ఇరుకున పెట్టడానికి గూరా?లాండ్ ఉద్యమాన్ని తెరచాటుగా నడిపిస్తున్న బీజేపీ, ఇతర ప్రాంతాల్లో మత రాజకీయాలను ప్రేరేపిస్తున్నదనే అనుమానాలు త ణమూల్ కాం గ్రెస్ నాయకులకు కలుగుతున్నది. పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నా రు. బీజేపీ జాతీయస్థాయి నాయకులు కూడా మమతా బెనర్జీపై ఆరోపణలను ఉధతం చేశారు. ఏదేమైనా మత కలహాలు చెలరేగినప్పుడు రాజకీ యపార్టీలు బాధ్యత మరిచి కలహాలకు దిగడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. మత విద్వేషాలను నిర్మూలించి సామాజిక సామరస్యాన్ని కాపాడవలసిన రాజకీయ వ్యవస్థనే స్వయంగా మతరాజకీయంతో కలుషితమైపోయింది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ మధ్య వివాదం కూడా అవాంఛనీయమైనది.
మతకలహాలు సాగుతున్న నేపథ్యంలో గవర్నర్ త్రిపాఠి తనతో అవమానకరం గా మాట్లాడారనేది మమతా బెనర్జీ ఆరోపణ. గవర్నర్ రాజ్యాంగ పరిమితులలో ఉండాలని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యాలయంగా మార్చకూడదని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారానికి వచ్చిన తరువాత అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ఘటనల్లో గవర్నర్ పాత్ర వివాదాస్పదమైంది. ఇటీవలనే పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడికి ముఖ్యమంత్రి నారాయణ స్వామికి వివాదం తలెత్తింది. బీజేపీ సంపూర్ణ మెజారిటీ పొందడంతో పాటు, మోదీ కూడా ఇందిరాగాంధీ తరువాత కాలంలో అత్యంత బలమైన ప్రధానిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన పడటంలో ఆశ్చర్యం లేదు. గూరా?లాండ్ ఉద్యమం, మత కలహాలు తమ పార్టీని దింపడానికి జరుగుతున్న కుట్ర అనే అనుమానం మమతా బెనర్జీకి ఉన్నది. దీనిని తొలిగించి భరోసా ఇవ్వడం బీజేపీ నేతల బాధ్యత. ఈ భరోసా ఎంత స్పష్టంగా ఉండాలంటే, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిమ్మళం పొందాలె. భవిష్యత్తులో ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ కేంద్రం నుంచి ముప్పు ఉన్నదనే భయం కలుగకూడదు. రాష్ట్రాల్లోని ప్రజా ప్రభుత్వాలను కూల్చివేయడం సమాఖ్యసూార్తిేకి విరుద్ధం. ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు అనేది బీజేపీ నినాదం. ఆ నినాదాన్ని అమలు చేసి చూపవలసిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉన్నది.


