అందరికి ఉచిత విద్య వైద్యం కల్పించడమే నా కోరిక: డిఎస్పి
- 11 Views
- admin
- July 12, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం సినిమా స్థానికం
కాకినాడ, ఫీచర్స్ ఇండియా: విదేశాలలో మాదిరిగాప్రజలందరికి విద్య వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తే ప్రపపంచంలోనే అద్భుతమైన ఆదర్శవంతమైన దేశంగా భారతదేశం ప్రత్యేక గుర్తింపు పొందుతుందని ఇది నా చిరకాల కోరికగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవీ శ్రీప్రసాద్ (డి.ఎస్.పి) అన్నారు. స్థానిక దంటు కళా వేదిక లో జరిగిన రోటరీ గోల్డెన్ జూబ్లీ నూతన కార్యవర్గ ప్రతిష్ఠాపనా వేడుకలలో డి.ఎస్.పి. ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగిస్తు రోటరీ గోల్డెన్ జూబ్లీ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. నాతండ్రి వైద్యులు కావడంతో పరిశర గ్రామాలలో వైద్యసేవలు అందించడంద్వారా అనేకమందికి ఆరోగ్య ప్రదాతగా కీర్తించబడ్డారని అదినాకు నేడు రోటరీ సేవలద్వారా గుర్తుకువచ్చిందని చెప్పారు. సేవాకార్యక్రమాలలో యువతకూడా భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ లెర్నింగి తరగతులద్వారా విద్యార్ధులకు సులభ రీతిలో పాఠ్యాంశాలు బోధించేందుకు ఎంతో వీలు కలుగుతుందని అటువంటి విద్యా సేవను కూడా రోటరీ గోల్డెన్ జూబ్లీ అమలు చేయడం పోటీ ప్రపంచంలో విద్యార్ధులకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో రోటరీ గోల్డెన్‌జూబ్లీ చేసిన కార్యక్రమాలు పనః సమీక్షించుకుంటూ కొత్త సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఉదయభాను టీమ్ ముందుకు రావడం గొప్పవిషయమని అభినందించారు.
ఇలస్టేషన్ ఆఫీసర్‌గా వ్యవహరించిన 2016-17 రోగరీ గవర్నర్ డా. విశ్వేస్వరరావు మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు క్యాన్సర్వంటి మహ్మారి రోగాన్ని ముందుగా పసిగట్టి వారికి సకాలంలో వైద్యసేవలు అందించేందుకు క్యాన్సర్ డిడెక్షన్ వ్యాన్ ఏర్పాటుచేయడానికి క్లబ్ ముందుకు రావడం గొప్పవిషయమన్నారు. లక్షడాలర్లతో స్థానిక కిరణ్ కంటి ఆసుపత్రినందు ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించి మందులను ఉచితంగా అందించే కార్యక్రమానికి రోటరీ గ్లోబల్ గ్రాంట్ విడుదల చేసారని గుర్తుచేసారు.
నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన ఉదయభాను మాట్లాడుతూ క్లబ్ సభ్యుల సహకారంతో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు తప్పక కృషిచేస్తామని చెప్పారు. గ్రామీణప్రాంతాలలో రక్షిత మంచినీటి సరఫరా పంపిణీపై దృష్టిపెడతామని, పాఠశాలల అభివృద్దిద్వారా విద్యార్ధులకు మేలుచేకూరే విద్యా కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడానికి కృషిచేస్తామని చెప్పారు. క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోటరీ బ్లడ్ బ్యాంక్, రోటరీ వృద్ధాశ్రయం, రోటరీ ఆర్.ఓ. ప్లాంట్, రోటరీ హాస్పటల్ మరియు డయాలసిస్ సెంటర్ విభాగాలద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు తప్పక కృషిచేస్తామని చెప్పారు.
డిఎస్పిని గజమాలతో ఉదయభాను, డా. ఎస్.వి.ఎస్.రావు టీమ్ ఘనంగా సత్కరించి రోటరీ వీల్‌ను జ్ఞాపికకాగా బహూకరించారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ వాకచర్లసూర్యంతో పాటు రోటరీ స్మార్ట్‌సిటీ అధ్యక్షులు వాకచర్లరవి, కార్యదర్శి కురెళ్ళ సూర్యనారాయణ, రోటరీ క్లబ్ అధ్యక్షులు చోడవరపు మూర్తి, వై వెంకటేష్, ధనసాగర్ ప్రసాద్, పెదగాడి వెంకటరమణ, డా వాడ్రేవు రవి, అప్పసాని కృష్ణకుమారి, నెక్కంటి శ్రీనివాస్, సమయమంతుల కృష్ణమోహన్, పెద్ది రత్నాజీ, పసలపూడి గోపాల్, దంటు సూర్యారావుతోపాటు పలువరు నగర ప్రముఖులు పాల్గొన్నారు.
ఫొటోలు : గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఉదయభాను, డిఎస్పిని సత్కరిస్తున్న దృశ్యం, క్లబ్ నూతన కార్యవర్గం.


