ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల హతం
- 12 Views
- admin
- July 12, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రీకులపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో భద్రతా బలగాలు కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించాయి. జమ్ము కశ్మీర్లోని బుద్గాం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి జరిపిన ఎన్కౌంటర్లో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.
బుద్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందిపైకి ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వీరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందినట్లు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిపిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
Categories

Recent Posts

